Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ పెద్దన్న పాత్ర.. సెల్యూట్ చేసిన ఎల్లో మీడియా

Pawan Kalyan: పవన్ పెద్దన్న పాత్ర.. సెల్యూట్ చేసిన ఎల్లో మీడియా

Pawan Kalyan: పవన్ ఒక విలక్షణ నాయకుడు. రాజకీయాన్ని రాజకీయంలా మాత్రమే చేయాలని బలంగా కోరుకుంటారు. ఆయనకు కుట్రలు తెలియవు.. కుతంత్రాలు అంతకన్నా తెలియవు. ఎత్తులు తెలియదు.. తెలిసినా వాటి జోలికి వెళ్లే మనస్తత్వం కాదు. జనాలకు అండగా ఉండడం.. జనాల సమస్యలకు పరిష్కారం చూపించడం మాత్రమే రాజకీయమని బలంగా నమ్మే నాయకుడు పవన్ కళ్యాణ్. రాజకీయాల కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని నిర్మొహమాటంగా చెప్పగల ధైర్యశాలి ఆయన.

పవన్ కళ్యాణ్ రాజకీయ బాధితుడే. ఇప్పుడు వైసీపీ బాధితుడు. గత ఎన్నికలకు ముందు టిడిపి బాధితుడు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగారు. ఆ సమయంలో టిడిపి శ్రేణులు, టిడిపి అనుకూల మీడియా పవన్ టార్గెట్ చేస్తూ గుప్పించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.ఇప్పుడు అదే టిడిపికి పవన్ ఆశాకిరణంగా మారిపోయారు. సినిమా స్టార్లు తమక అవసరం లేదన్న నోరే.. ఇప్పుడు పవన్ తమకు పెద్దన్న అని సౌండ్ చేస్తుంది. ఇది కదా సేనాని రేంజ్ అంటూ జన సైనికులు గర్వంతో కనిపిస్తున్నారు. పార్ట్ టైం రాజకీయ నాయకుడు అని ఇన్నాళ్లు విమర్శలు ఎదుర్కొన్న పవన్.. తాను రంగంలోకి దిగితే రేంజ్ ఎలా ఉంటుందో అని చేసి చూపించారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత టిడిపి శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకు పోయాయి. ఇటువంటి సమయంలో లోకేష్ అన్నా అని పిలిచిన వెంటనే.. నేనున్నా అంటూ పవన్ ముందుకొచ్చిన తీరుపై తెలుగుదేశం పార్టీ ఫిదా అవుతోంది. టిడిపి అనుకూల మీడియా అయితే ఏకంగా పవన్ కు సెల్యూట్ చేసింది. అసాధారణ పోరాట పటిమ చూపిస్తున్నారని.. కష్టకాలంలో ఉన్న మిత్రుడ్ని అండగా నిలిచారని కృతజ్ఞత చెబుతోంది. విమర్శనాత్మక కథనాలతో పవన్ ను పలుచన చేయాలని చూసిన మీడియా ఇప్పుడు పవన్ కు సాగిలాల పడుతోంది. ఇది కదా అసలు విజయం అని జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.

పవన్ తాజా ప్రకటనతో ఎన్నో రకాల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. తమ పార్టీ ఎదగడానికి ఒక అవకాశంగా దీనిని మలుచుకోకుండా.. సాటి మిత్రపక్ష నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక పెద్దన్నల పవన్ వ్యవహరించిన తీరు టిడిపి శ్రేణులను సైతం ఆకట్టుకుంటుంది. అటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో సైతం ఆలోచన తెచ్చిపెడుతోంది. ఇంతవరకు పవర్ షేరింగ్ విషయంలో ఆలోచించిన టిడిపి నుంచి కూడా పవన్ కు మద్దతు లభిస్తోంది. పవన్ కు సీఎం పదవిలో వాటా ఇస్తే అభ్యంతరం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే పవన్ యుద్ధ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper