spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!

ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గొడవ.. రైతుల్లో ఆందోళన!

ap, telangana war : తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీ తలెత్తింది. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని ఉన్నఫళంగా అడ్డుకుంది తెలంగాణ. వడ్ల లోడుతో వస్తున్న వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు తెలంగాణ పోలీసులు! దీంతో.. ఊహించని పరిణామంతో ఏపీ రైతులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. అన్ని అనుమతులూ ఉన్నప్పటికీ.. తమను అడ్డుకున్నారని, ఇది సరికాదని ఆంధ్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP CM Jagan, TS CM KCR

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రినుంచే ఈ చర్యకు దిగారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని ఆపేస్తున్నారు. ఫలితంగా.. ధాన్యంతో వచ్చిన లారీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల రగడ సాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ధా\న్యం కొనుగోలు చేయట్లేదని తెలంగాణ సర్కారు వాదిస్తోంది. దీన్ని బీజేపీ కౌంటర్ చేస్తోంది. టీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేయకుండా కేంద్రాన్ని నిందిస్తోందని కమలనాథులు అంటున్నారు. ఈ వివాదం రోజులతరబడి సాగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. తెలంగాణ సర్కారు ధర్నాకు సైతం దిగింది. అంతేకాదు.. వరి సాగు చేయొద్దని కూడా రైతులకు సూచించింది తెలంగాణ సర్కారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇక్కడి రైతుల ధాన్యం కొనుగోలు అంశమే డైలమాలో పడింది. అందుకే.. ఏపీ నుంచి వస్తున్న ధాన్యాన్ని అడ్డుకున్నట్టు సమాచారం.

అయితే.. ఏపీ రైతులు మాత్రం తీవ్ర అవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యాన్ని తిరిగి తీసుకెళ్లి, నిల్వ చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ విషయంపై స్పందించి.. తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే విషయంపై ఈరోజు స్పష్టత రానుంది. ఇవాళ కేంద్ర మంత్రితో.. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ భేటీలో కేంద్రం ఎంత మేర ధాన్యం కొనుగోలు చేయనుంది అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య మరో పంచాయితీ మొదలైంది. ఇప్పటికే కొనసాగుతున్న నీటి వివాదం.. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ మధ్య కరోనా పేషెంట్లను అనుమతించే విషయంలోనూ వివాదం చెలరేగింది. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల గొడవ. మరి, ఈ సమస్యపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి వైఖరి అవలంభించనున్నారు? కేంద్ర ఏమైనా జోక్యం చేసుకుంటుందా? ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper