iBomma 1 Mirror Active: అరుంధతి సినిమా చూశారా అందులో పశుపతిని అనుష్క చంపేస్తుంది. అతడిని బంధిస్తుంది.. సమాధిలో ఉంచేస్తుంది. ఆ తర్వాత అతడు అనేక గిమిక్కులు చేసి సమాధి నుంచి బయటికి వస్తాడు.. వదలా బొమ్మాళి అంటూ అనుష్క వెంట పడుతుంటాడు. ఇప్పుడు ఐ బొమ్మ వెబ్ సైట్ వ్యవహారం కూడా అలానే ఉంది.
Also Read: బొమ్మ బాగుంటే ఐ బొమ్మ ఏం చేయలేదు.. సినిమా పెద్దలూ మీ కింది నలుపుకు సిగ్గు పడండి!
ఇటీవల తెలంగాణ పోలీసులు ఐ బొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. కమిషనర్ సజ్జనార్ ఏకంగా సినీ ప్రముఖులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఐ బొమ్మ నిర్వాహకుడు రవి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు ఐ బొమ్మ లో సినిమాలు చూసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. అంతేకాదు రవితో ఐ బొమ్మ సైట్ మొత్తాన్ని మూయించారు. ఇకపై ఈ వెబ్సైట్ కార్యకలాపాలు సాగించదని ఒక ప్రకటన కూడా చేయించారు. దీంతో కొద్దిరోజులుగా ఐ బొమ్మ సైట్ పనిచేయడం లేదు. అయితే ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు. ఇక్కడి నుంచే పైరసీ ముఠా స్టోరీని మరోవైపు మళ్ళించింది.
వాస్తవానికి పైరసీ వీడియోలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచే వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఐ బొమ్మ ఇందులో ఒకటి మాత్రమే.. ఇటువంటి సైట్లు.. వాటికి అనుబంధమైన మిర్రర్ సైట్లు చాలా ఉన్నాయి.. ఐ బొమ్మ కథ ముగిసిందని పోలీసులు భావిస్తున్న తరుణంలో తెరపైకి ఐ బొమ్మ వన్ అందుబాటులోకి వచ్చింది.. కొత్తగా వచ్చిన ఈ వెబ్ సైట్ లో ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే నేరుగా మూవీ రూల్స్ కు కనెక్ట్ అవుతోంది.
Also Read: ఐ బొమ్మ రవిని హీరో చేయొద్దు.. సజ్జనార్ సార్ సీరియస్ వార్నింగ్!
ఐ బొమ్మ సైట్ ను రూపొందిస్తున్నప్పుడే ఏకంగా దాని ఎకోసిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లను ఏర్పాటు చేశారు. అందువల్లే ఐ బొమ్మ 1 వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పోలీసులు మూవీ రూల్స్, తమిళ్ ఎంవి వెబ్సైట్లపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.. అయితే పైరసీ సినిమాలను విడుదల చేసే వెబ్సైట్లు చాలా ఉన్నాయని.. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావాలని పోలీసులు చెబుతున్నారు. పైగా ఈ వెబ్సైట్ లు రకరకాల డొమైన్ లతో ఉన్నాయని.. ప్రపంచంలోని పలు దేశాలలో దీని నిర్వాహకులు ఈ వెబ్సైట్ల ను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అందువల్లే పోలీసులకు పట్టుకోవడం కష్టమవుతుందని సమాచారం.