spot_img
Homeజాతీయ వార్తలుKCR: కేసీఆర్‌ యూటర్న్.. ‘సెంటిమెంట్‌’ విడిచి సాము చేయలేని పరిస్థితి!

KCR: కేసీఆర్‌ యూటర్న్.. ‘సెంటిమెంట్‌’ విడిచి సాము చేయలేని పరిస్థితి!

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అంతా తమయే అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రి, ఆర్థిక మంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పదే పదే చెబుతున్నా.. గ్రౌండ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రచారానికి వెళ్తున్న నేతలకు ఈ విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా కేసీఆర్‌ తన సభల్లో చేతులు ఎత్తండి అనే పిలుపుకు స్పందన కరువవుతోంది. మొదట్లో సభకులు బాగానే స్పందించినా.. రానురాను చెయేత్యేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఓటర్లలో బీఆర్‌ఎస్‌పై పునరాలోచన మొదలైందన్న భావన గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. దీంతో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు మళ్లీ ఎత్తుగడ వేస్తున్నారు.

జాతీయ వాదమని..
‘తెలంగాణ బంగారు తునక అయింది. ఇక దేశాన్ని ఉద్దరిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి.. ఇక తనది తెలంగాణ వాదం కాదని.. జాతీయవాదం’ అని కేసీఆర్‌ ప్రకటించారు. కానీ తెలంగామ ఎన్నికలకు వచ్చే సరికి.. మనది నీది తెలంగాణ.. నాది తెలంగాణ.. మనది తెలంగాణ.. జై తెలంగాణ అనే నినాదాలు ఇస్తున్నారు. ఢిల్లీ వాళ్లొస్తే తరిమికొడదామంటున్నారు. కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నేతల్లో వచ్చిన ఈ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ చూసి జనమే ఆశ్చర్యపోతున్నారు. బీఆర్‌ఎస్‌ పేరుతో కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేశారు. పంజాబ్‌ లాంటిచోట్ల రైతు కమిటీల్ని నియమించారు. ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఒడిశా, ఏపీ, మహారాష్ట్రకు ఇన్‌చార్జులను కూడా నియమించారు. మహారాష్ట్రకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తూ.. ఇతర రాష్ట్రాల వాళ్లకు తెలంగాణతో ఏం పని అని దూకుడుగానే ప్రశ్నించడం ప్రారంభించారు.

జాతీయపార్టీపై వెనుకడుగు..
పరిస్థితి చూస్తుంటే.. ఉన్నది.. ఉంచుకున్నది రెండు పోయే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ వాదం వదిలేసి కేసీఆర్‌ తప్పు చేస్తున్నారని.. తెలంగాణ లేకపోతే ఆయన పూర్తిగా బలహీనపడతారన్న అంచనాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర సాధన లక్ష్యంతో చేశారు. ఆ పార్టీకి కుల, మతాలకు అతీతమైన ఓటు బ్యాంక్‌ కేవలం తెలంగాణ వాదం మీదనే ఉంది. అవే ఆ పార్టీకి కవచ కుండలాలు. వాటిని తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. టీఆర్‌ఎస్‌ విజయాల్లో తెలంగాణ వాదానిదే అగ్రస్థానం. ఆ పార్టీని బీఆర్‌ఎస్‌గా మారుస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు . కేసీఆర్‌ తప్పు చేస్తున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్‌ ముందుకే వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో ఉన్న పరిస్థితుల్ని చూసిన తర్వాత తన బలాన్ని తాను మళ్లీ తెచ్చుకోవాలని డిసైడయ్యారు. సడెన్‌గా వ్యూహం మార్చినట్లుగా భావిస్తున్నారు. ముందు ఎన్నికల్లో గెలవాలి.. గెలవకపోతే కేసీఆర్‌ ఊహించనంత గడ్డుపరిస్థితి ఎదురవుతుంది. జాతీయ రాజకీయాలు కాదు ఇంత కాలం తెలంగాణలో నిర్మించుకున్న ఇమేజ్‌ కూడా డ్యామేజ్‌ అవుతుంది. అందుకే.. చివరి అస్త్రంగా మళ్లీ తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారు గులాబీ బాస్‌. మరి ఈ నినాదం విజయతీరానికి చేరుస్తుందో లేదో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper