Producer Dil Raju
Dil Raju: నైజాం కింగ్ గా దిల్ రాజు పేరుంది. చెప్పాలంటే ఒక్క నైజాంనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దిల్ రాజు చేతిలో ఉంది. ఆ కారణంగా ఎంత పెద్ద హీరో సినిమా అయినా దిల్ రాజు కనుసన్నల్లో విడుదల కావాలి. విడుదల తేదీలు, థియేటర్స్ పంపకాలు అతని చేతిలో ఉంటాయి. చాలా కాలంగా దిల్ రాజు గుప్తాధిపత్యం నడుస్తుంది. దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్ థియేటర్స్ గుప్పెట్లో పెట్టుకున్నారు.
సంక్రాంతి వచ్చిందంటే దిల్ రాజు కేంద్రంగా థియేటర్స్ పంచాయితీ షురూ అవుతుంది. 2023 సంక్రాంతి పెద్ద గొడవే జరిగింది. సొంత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ స్టార్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ని దిల్ రాజు కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు దిల్ రాజు థియేటర్స్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. మెజారిటీ థియేటర్స్ తాను నిర్మించిన వారసుడు చిత్రానికి కేటాయించాడు.
వారసుడు విడుదల జనవరి 14కి వాయిదా పడటం వలన మైత్రీ మూవీ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ కోల్పోయేవారు. భారీ చిత్రాల నిర్మాతలుగా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ దిల్ రాజు అధిపత్యానికి గండి కొట్టాలని చూస్తున్నారు. ఆ దిశగా మరో అడుగు పడింది. సలార్ నైజాం హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.
సలార్ వంటి భారీ చిత్రం దిల్ రాజు చేయి జారడం ఊహించని పరిణామం. ఆయనకు ఇది పరాభవమే. ఈ క్రమంలో టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. చూస్తుంటే సమీప కాలంలో దిల్ రాజుని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అధిగమించే అవకాశం కలదంటున్నారు. కాగా సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. యూఎస్ లో ఓపెనింగ్స్ మొదలయ్యాయి. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ తెరకెక్కింది.
Excited to partner with @MythriOfficial as we present #SalaarCeaseFire to the incredible audience of ().#Salaar Trailer on Dec 1st at 7:19 PM #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/heawTv1wC5
— Salaar (@SalaarTheSaga) November 16, 2023
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Mythri movies check for dil raju big blow in case of salaar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com