Ruchika Singh Controversy: దేశ ప్రధాని నరేంద్ర మోడీని రుచికా సింగ్ అనే social media influencer విపరీతంగా తిట్టింది. పైగా వీడియోలు కూడా చేసింది. సోషల్ మీడియాలో పెట్టేసింది. ఒక వర్గం వారు ఆమెకు సపోర్ట్ చేశారు. నరేంద్ర మోడీని తిడుతుంది అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కొంతమంది ఎర్రి భావజాలం ఉన్నవాళ్లు వ్యాఖ్యానించారు. రుచికా సింగ్ వీడియోలను తమకు అనుకూలమైన వేదికలలో పోస్ట్ చేసుకుని శునకానందం పొందారు.
నరేంద్ర మోడీని తిట్టినందుకు రుచికా సింగ్ మీద బిజెపి నాయకులు మండిపడలేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేపథ్యం ఉన్నవారు కూడా తిట్టిపోయలేదు. ఆమె అన్న మాటలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కనీసం ఆమె మీద కేసులు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు రుచికా సింగ్ కు దిమ్మ తిరిగిపోతుంది. ఆమె మీద తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రధానమంత్రిని విమర్శించినందుకు ఆమె మీద ఎటువంటి రాజకీయ సంస్థలు లేదా ప్రభుత్వ యంత్రాంగం దాడి చేయలేదు. కేవలం సామాన్య ప్రజల నుంచి ఆమెకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఒకరకంగా ఆమెను పురుగును చూసినట్టు చుట్టుపక్కల జనాలు చూస్తున్నారు. ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనను తాను ఎలా కాపాడుకోవాలో కూడా తెలియడం లేదు. తన వీడియోలను వివిధ మాధ్యమాలలో పోస్ట్ చేసి రాజకీయ అనుకూల ప్రచారం చేసుకున్న నాయకులు కనిపించడం లేదు. కనీస ఆమెకు వాళ్లు అండగా కూడా ఉండడం లేదు.
ఈ నేపథ్యాలు రుచికా సింగ్ లో మార్పును తీసుకొచ్చాయి. దీంతో ఆమె తనను తాను బాధిత పక్షం లాగా అభివర్ణించుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టింది. తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయిందని.. నరేంద్ర మోడీ మీద వ్యాఖ్యలు చేయడం వల్ల తాను జీవితాన్ని కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.. కనీసం బయటికి అడుగు పెట్టే ధైర్యం కూడా చేయలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రుచిక సింగ్ వీడియోల పట్ల సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ” నరేంద్ర మోడీ విధానాలను విమర్శించవచ్చు. నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పట్టవచ్చు. ఒక భారతీయ పౌరురాలిగా నీకు హక్కు ఉంది. కానీ ఆ స్వేచ్ఛను నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. అడ్డగోలుగా మాట్లాడటం మొదలుపెట్టావ్. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశావు. ఆయన ఒక ప్రధానమంత్రి అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయావ్. నోటికి ఎంత వస్తే అంత మాటలు వదిలిపెట్టావ్. జనం చూస్తూ ఊరుకోరు కదా.. జనాల గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నారు. అటువంటి వ్యక్తిని విమర్శిస్తే ఎలా ఊరుకుంటారు.. ఇందులో ప్రధాన మంత్రికి సంబంధం లేదు. బిజెపి నాయకులకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వ వర్గాలకు సంబంధం లేదు. చివరికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేస్తున్న వారికి సంబంధం లేదు. సామాన్య జనం మాత్రమే సంబంధం పెట్టుకున్నారు. అది కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో. ఇప్పటికైనా మనిషిలాగ బతుకు. మనిషిలాగ ఆలోచించి అంటూ” సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా రుచికా సింగ్ మారుతుందా.. నరేంద్ర మోడీని విమర్శిస్తున్న వారు తమ ధోరణి మార్చుకుంటారా.. చూడాల్సి ఉంది..