Long Term Investment : నేటి కాలంలో డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ డబ్బును రెట్టింపు చేయడానికి ఉన్న మార్గాల్లో సరైనవి ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అంటే కొందరు తమ వద్ద డబ్బు మిగలగానే దానిని సేవింగ్ చేయాలని అనుకుంటారు. మరికొందరు మాత్రం ఆ డబ్బును రెట్టింపు చేయాలని అనుకుంటారు. డబ్బును రెట్టింపు చేయాలని అనుకునేవారు ప్రణాళిక ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. వీటిలో కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అంటే పెట్టుబడి పెట్టే డబ్బు ఏ రకంగా మనకు అవసరం పడాలి? ఎప్పుడు అందుబాటులోకి రావాలి? అనేది తెలుసుకున్నాకా.. ఆ తర్వాత ముందుకు వెళ్లాలి. అయితే ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో అవగాహన ఉండాలి..
సెలెక్టింగ్ ఫండ్:
చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. కొందరు తమ కూతుర్లు లేదా కుమారులు . మరికొందరు వయసు పైబడిన వారు తమ మనవరాళ్ల కోసం లేదా మనుమల కోసం డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. కనీస కాలపరిమితిని నిర్ణయించి వారు పెట్టిన పెట్టుబడి కంటే డబ్బులు వచ్చినా చాలు అని అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది మ్యూచువల్ ఫండ్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇందులోనూ ఫండ్ ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. కొంతమంది ప్రస్తుతం గ్రోత్ ఉన్న ఫండ్ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ తాత్కాలిక పరిస్థితి కాకుండా.. ఆ ఫండ్ చరిత్రను కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం రాకపోయినా సేఫ్ గా ఉంటుందా? లేదా అనేది తెలుసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఎప్పటికైనా ఊహించిన దాని కంటే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
టెన్యూర్ ప్రకారం గా ఇన్వెస్ట్మెంట్:
ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాము అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా పెట్టి అలా రిటర్న్స్ రావాలంటే కుదరదు. ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ రావాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే. కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలపాటు వెయిట్ చేస్తే ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఎంతకాలం టెన్యూర్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం అని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.
పెట్టుబడి మర్చిపోవడం:
పెట్టుబడి పెట్టిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా ఇతర వాటిపై ఆలోచన చేయాలి. ఎందుకంటే పదేపదే ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫండ్స్ చూస్తూ ఉంటే మనసు ఆందోళన కలుగుతుంది. కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పటికీ గ్రోత్ ఉండే అవకాశం ఉండదు. అందువల్ల ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి కనీసం ఐదు సంవత్సరాల పాటు మర్చిపోయిన విధంగా ఉంటూ.. వాటిని పట్టించుకోకపోతే.. ఆ తర్వాత రిజల్ట్ తెలుస్తుంది.