Homeజాతీయ వార్తలుRamadan Month : రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారికి గుడ్ న్యూస్..

Ramadan Month : రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే వారికి గుడ్ న్యూస్..

Ramadan Month :  ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పర్వదినాలు మార్చి 2 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 1వ తేదీన సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో ఆ దేశంలో ఒక రోజు ముందు నుంచే ఉపవాసాలు ఉండడం ప్రారంభించారు. రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతారు. కఠోరమైన నియమాలతో ఈ దీక్షలు చేపట్టి అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందు.. దీక్ష చేపట్టి సూర్యస్తమం తరువాత ముగిస్తారు. మధ్యాహ్న కాలం మొత్తం కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఈ క్రమంలో సాయత్రం రకరకాల వంటలు చేసుకొని ఆరగిస్తారు. అయితే పట్టణాలు, నగరాల్లో రాత్రి సమయాల్లో ఎక్కువగా ముస్లింలు వివిధ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందువల్ల రాత్రిళ్లు కొన్ని షాపులు కొనసాగుతాయి. వీరికి ప్రభుత్వం ఓ సదుపాయం కల్పించింది.. అదేంటంటే?

రంజాన్ మాసం మొత్తంలో 24 గంటలు షాపులు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు షాపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఈ నెలలో ఎక్కువగా రంజాన్ కు సంబంధించిన షాపింగ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో ఉపవాసం ఉన్న వారు రాత్రి సమయంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతారు. అందుకే ఈ అవకాశం ప్రభుత్వం కల్పించింది.

Also Read : భారతదేశంలో రంజాన్‌ తేదీ ఖరారు.. ఏ రోజు నుంచి ఉపవాసం ఉండాలంటే..

అయితే షాపులు నిర్వహించేవారు కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఇందులో పనిచేసేవారికి లేబర్ యాక్ట్ నియమాలు వర్తిస్తాయని తెలిపింది. షాపులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు 8 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే వారికి అదనంగా వేతనం చెల్లంచాలని తెలిపింది. అలాగే వారం మొత్తం 48 గంటల కంటే ఎక్కువ పనిచేయించుకున్నా.. అందుకు ఓడీ చెల్లించాలని కార్మిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఉద్యోగాలు చేసే ముస్లింలు కార్యాలయాల నుంచి ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ అవకాశం మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తిస్తుంది. సాయంత్రం ప్రార్థనలు ఉన్నందున ఈ అవకాశాన్ని కల్పించారు.

ఇక రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు హరీస్ స్టాళ్లు సందడి చేయున్నాయి. పట్టణాలతో పాటు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసి హరీస్, హలీమ్ తో పాటు వివిధ రకాల రుచికరమైన వంటలు అందుబాటులో ఉంచనున్నారు. ఈ స్టాళ్లకు ముస్లింలు రాత్రి సమయాల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ స్టాళ్ల నిర్వహణ 12 గంటల వరకు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు 24 గంటల అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఎక్కువ సమయం వరకు నిర్వహించే అవకాశం ఉంది. అయితే కూడళ్లలో ఈ స్టాళ్లు నిర్వహించేవారు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Oktelugu Epaper