Ahmedabad plane crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతోంది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు, 19 మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్లు దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోవడం దుర్ఘటనకు ప్రధాన కారణంగా గుర్తించింది.
సెకన్ల వ్యవధిలో ఘోరం..
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ–171, బోయింగ్ 787–8 డ్రీమ్‌లైనర్, అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ గాట్విక్‌కు బయలుదేరిన 30 సెకన్లలోనే కూలిపోయింది. ఉదయం 11:17 గంటలకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్న విమానం, మధ్యాహ్నం 1:37:37 గంటలకు టేకాఫ్ ప్రారంభించింది. 1:38:39 గంటలకు గాల్లోకి లేచిన వెంటనే, ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ స్థితికి మారాయి, దీంతో రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. 30 సెకన్లలో విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది.
Also Read : అమెరికా కంటే ఇండియా బెస్ట్.. చైనా మారింది.. కానీ భారత్ ఛాన్స్ ఇస్తుందా?
దుర్ఘటనకు కీలక కారణం..
ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక ప్రకారం.. టేకాఫ్ తర్వాత 3 సెకన్లలో రెండు ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఒక సెకను వ్యవధిలో రన్ నుండి కటాఫ్ స్థితికి మారాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఒక పైలట్, ‘‘నీవు ఎందుకు కటాఫ్ చేశావు?’’ అని అడగగా, మరొక పైలట్, ‘‘నేను చేయలేదు’’ అని స్పందించినట్లు రికార్డ్ అయింది. స్విచ్‌లు తిరిగి రన్ స్థితికి మార్చబడినప్పటికీ, తక్కువ ఎత్తు వల్ల ఇంజిన్లు పునరుద్ధరణకు సమయం సరిపోలేదు. ఎందుకంటే అవి రెండు–దశల లాకింగ్ మెకానిజంతో రూపొందించబడ్డాయి. 2018 ఎఫ్‌ఏఏ హెచ్చరికను ఎయిర్ ఇండియా పాటించకపోవడం కూడా ఈ సందర్భంలో ప్రశ్నలను లేవనెత్తుతోంది.
కాక్‌పిట్‌లో గందరగోళం..
విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (8,600 గంటల బోయింగ్ 787 అనుభవం), ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ (1,100 గంటల అనుభవం) ఉన్నారు. కాక్‌పిట్ రికార్డింగ్‌లో పైలట్ల మధ్య గందరగోళ సంభాషణ రికార్డ్ అయింది, ఇది స్విచ్‌ల మార్పు గురించి వారి అవగాహన లేనితనాన్ని సూచిస్తుంది. టేకాఫ్ తర్వాత 10 సెకన్లలో స్విచ్‌లు తిరిగి రన్ స్థితికి మార్చబడ్డాయి, కానీ విమానం 650 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల రికవరీ సాధ్యపడలేదు.
Also Read: బిగ్ బ్యూటిఫుల్ బిల్ షాక్.. విదేశీ విద్యార్థులకు కష్టకాలం..
యాంత్రిక లోపమా.. మానవ తప్పిదమా?
ప్రాథమిక నివేదిక యాంత్రిక లోపం లేదా డిజైన్ లోపాన్ని నిర్ధారించలేదు, కానీ 2018లో ఎఫ్‌ఏఏ హెచ్చరిక స్విచ్ లాకింగ్ మెకానిజం వైఫల్యం గురించి సూచించింది. ఎయిర్ ఇండియా ఈ హెచ్చరికను అమలు చేయకపోవడం విమర్శలకు దారితీసింది. ఇంధన నమూనాలు, రన్‌వే పరిస్థితులు, వాతావరణం సాధారణంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది,
మినిట్ టు మినిట్ ఇదీ…
జూన్ 12 ఉదయం 11:17 గంటలు: ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చింది.
మధ్యాహ్నం 1:10:38 గంటలు: విమానాశ్రయంలోని బే34 నుంచి లండన్‌కు బయల్దేరేందుకు సిద్ధమైంది.
మధ్యాహ్నం 1:25:15 గంటలు: ట్యాక్సీ క్లియరెన్స్ కోరగా.. ఎయిర్హోఫిక్ కంట్రోల్ అనుమతించింది. ఒక నిమిషం తర్వాత విమానం బే34 నుంచి ఆర్ ట్యాక్సీవే మార్గంలో 23వ రన్వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్‌కు రెడీ అయింది.
Ahmedabad
మధ్యాహ్నం 1:32:03 గంటలు: విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్‌కు మారింది.
మధ్యాహ్నం 01:37:33 గంటలు: టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయ్యింది.
మధ్యాహ్నం 01:37:37 గంటలు: విమానం టేకాఫ్ ప్రారంభించింది.
మధ్యాహ్నం 01:38:39 గంటలు: విమానం ఎయిర్/గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్‌లోకి మారాయి. దీంతో లోహవిహంగం గాల్లోకి లేచింది. 30 సెకన్లలో విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది.