Anil Ravipudi Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ని ఉద్దేశిస్తూ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుధీర్ విషయంలో నేను కూడా బాధపడ్డట్లు వెల్లడించాడు. ఇంతకీ సుడిగాలి సుధీర్ కి జరిగిన అన్యాయం ఏమిటీ? ఈ స్టోరీలో చూద్దాం..
అతి తక్కువ స్థాయి నుండి స్టార్ గా ఎదిగాడు సుడిగాలి సుధీర్( Sudigali Sudheer). వృత్తిపరంగా సుడిగాలి సుధీర్ స్ట్రీట్ మెజీషియన్. హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో మంచి నీళ్లు తాగి, ఫ్లాట్ ఫార్మ్స్ మీద పడుకున్న సందర్భాలు ఉన్నాయని ఒకప్పటి తన దీన స్థితి వెల్లడించాడు. జబర్దస్త్ సుధీర్ ఫేట్ మార్చేసింది. టీమ్ సభ్యుడిగా వచ్చి లీడర్ అయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్ తో సుధీర్ కాస్త సుడిగాలి సుధీర్ అయ్యాడు. సుధీర్ కి గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వంటి టాలెంటెడ్ కమెడియన్స్ తోడు కావడంతో, జబర్దస్త్ ని దున్నేశాడు. సుడిగాలి సుధీర్ టీమ్ కి ఆడియన్స్ లో ప్రత్యేక ఇమేజ్ ఉండేది.
Also Read: మొండికేస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం.. ఇలా అయితే ఈసారి కూడా కష్టమే!
అనంతరం ఢీ యాంకర్ గా మారిన సుధీర్ మరింత ఫేమ్ రాబట్టాడు. ఢీ వేదికగా సుధీర్ తనలోని మరికొన్ని కోణాలు బయటకు తీశాడు. సుధీర్ మెజీషియన్ మాత్రమే కాదు. అతడికి సింగింగ్, డాన్సింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ తో సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరో ఎత్తు. బుల్లితెర లవ్ బర్డ్స్ గా వీరు పేరు తెచ్చుకున్నారు. వెరసి సుధీర్ బుల్లితెర స్టార్ అయ్యాడు. అనంతరం హీరోగా కూడా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.
సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా మారిన సుధీర్.. గాలోడు చిత్రంతో హిట్ కొట్టాడు. సుధీర్ హీరోగా స్థిరపడటం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో తిరిగి యాంకరింగ్ పై దృష్టి పెట్టాడు. కాగా సుడిగాలి సుధీర్ పై ప్రతి ఒక్కరు జోక్స్ వేస్తారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో ఇదే ఫార్ములా ఫాలో అయ్యేవారు. సుధీర్ ని ఒక ప్లే బాయ్ గా చిత్రీకరించారు. అతడు స్త్రీ లోలుడు అని అర్థం వచ్చేలా కామెడీ పంచులు వేస్తారు. తన కంటే తక్కువ స్థాయి కమెడియన్స్ వేసే జోక్స్ ని కూడా సుధీర్ తీసుకుంటాడు.
Also Read: ‘డీజే టిల్లు’ కాంబినేషన్ ని రిపీట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ.. ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా?
కాగా దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించిన డ్రామా జూనియర్స్, కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ వంటి షోలకు సుధీర్ యాంకర్ గా ఉన్నాడు. ఈ క్రమంలో సుధీర్ మీద అనిల్ రావిపూడి వేసిన పంచులు ఆయన అభిమానులను కూడా హర్ట్ చేశాయి. తాజాగా ఈ కామెడీ పంచులపై అనిల్ రావిపూడి స్పందించారు. తనకు ఇష్టం లేకపోయినా రైటింగ్ టీమ్ రాసిచ్చే పంచులు నేను వేసేవాడిని. కొన్ని పంచులు అయితే అవైడ్ చేసేవాడిని. సుధీర్ మాత్రం మొహమాటం లేకుండా తన మీద పంచులు వేయమని అనేవాడు. సుధీర్ మీద జోక్స్ వేస్తే జనాలు ఎంటర్టైన్ అవుతారని రైటింగ్ టీమ్ రాసిన పంచులు నేను వేసేవాడిని అని వివరణ ఇచ్చాడు.