Trivikram Srinivas : : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) లాంటి దర్శకుడు సైతం కెరియర్ మొదట్లో కథ మాటల రచయితగా తన మార్కును చూపిస్తూ భారీ విజయాలను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ సినిమాలను చేయడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తూ ప్రతి ఒక్క స్టార్ హీరోకి మంచి ఇమేజ్ ను అందించే విధంగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎంటైర్ ఇండియా మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టామినా ఏంటో చూస్తారు అంటూ ఒక పెను సవాళ్లను కూడా విసురుతూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పోసాని కృష్ణమురళి ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు లను ఉద్దేశించి కొన్ని బూతులు అయితే మాట్లాడాడు. దానివల్లే అతని మీద కొన్ని కేసులు ఫైల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ కేసులకి సంబంధించిన విచారణలు చేపట్టడానికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కొంతవరకు బాగాలేదనే వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన పూనమ్ కౌర్ (Punam Kour) ee విషయం మీద స్పందిచారు.
Also Read :సినిమాలకు శాశ్వతంగా దూరం కానున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..పవన్ కళ్యాణ్ కోసం ఇంత త్యాగమా?
ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటునే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడిని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకొచ్చారు అంటూ డైరెక్ట్ గా త్రివిక్రమ్ మీద కొన్ని కామెంట్స్ చేస్తు ట్వీట్ అయితే చేశారు. ఆయన వల్లే చాలామంది కెరియర్లు కూడా నాశనం అవుతున్నాయి అంటూ ఆమె మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత మూడు నెలల్లో ఆమె త్రివిక్రమ్ టాపిక్ ను తీసుకురావడం ఇది మూడోసారి…
పదేపదే ఆమె త్రివిక్రమ్ ను ఎందుకు టార్గెట్ చేస్తుంది. ఆమె మాట్లాడాలనుకున్న మాటలు ఏంటి ఆమె దేని గురించి మాట్లాడాలనుకుంటుందో అదంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి మాట్లాడొచ్చు కదా మధ్య మధ్యలో ఇలాంటి ట్వీట్లు ఎందుకు చేస్తుంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం ఆమెను ప్రశ్నిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ట్వీట్ వేసిన కూడా అందులో త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ రాయడం అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ట్వీట్ మీద త్రివిక్రమ్ స్పందిస్తాడా? లేదంటే కామ్ గానే ఉంటాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : బైక్ గిఫ్ట్ గా ఇస్తా… హీరో కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్, ఇలా చేస్తే చాలు, అది మీ సొంతం!