TV5 Murthy : సాయంత్రం డిబేట్లు.. ఉదయం మొత్తం న్యూస్ ప్లానింగ్.. మధ్యాహ్నం సిబ్బందితో సమావేశం.. క్షేత్రస్థాయిలో పర్యటనలు.. ఇప్పుడు సీఈవో అయిపోయారు కాబట్టి ఛానల్ నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలు.. ఇన్ని పనులు చేసే ఏ మనిషికైనా కచ్చితంగా తలనొప్పి అంటూ ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉంటుంది. దీనికి అలసట కూడా తోడవుతుంది. అలాంటప్పుడు సాంత్వన కావాలి . తాజా గాలిని పీల్చాలి. ప్రశాంతంగా ఉండాలి.. వీటన్నింటి కోసం టీవీ5 సీఈవో మూర్తి అమెరికా వెళ్లారు… దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: వరదలో కొట్టుకొస్తున్నాడు.. ఆ ఇద్దరు ఆమాంతం దూకి ఎలా కాపాడారో చూడండి
అమెరికా వెళ్లిన మూర్తి కాంక్రీట్ జంగిల్స్ లో ఉండకుండా.. నేలతల్లి ని పలకరించారు. పచ్చని పుడమిని చూసి ఆనంద పరవశుడయ్యారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న తోటను మూర్తి చూశారు. మొక్కజొన్న తోట మీదుగా వస్తున్న గాలిని ముక్కుల నిండా పీల్చుకున్నారు. వారెవా ఇది కదా అద్భుతం అంటూ తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏపుగా పెరిగిన మొక్కజొన్న తోట ను చూసిన మూర్తి.. ఇంత ఎత్తులో ఆంధ్రాలో ఎందుకు పెరగదు.. ప్రకృతికి ఎటువంటి సరిహద్దులు ఉండవు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
టీవీ5 సీఈవో అయిన తర్వాత మూర్తి డిబేట్లు మాత్రమే కాకుండా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. తన తొలి ఇంటర్వ్యూను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇటీవల భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితతో కూడా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ జరిపారు. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆమెను ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మొత్తంగా తనలో ఉన్న విభిన్నమైన పాత్రికేతత్వాన్ని మూర్తి చూపిస్తున్నారు.
Also Read: గోనె సంచుల కోటు.. ధర తెలిస్తే షాకే!
డిబేట్లలో మూర్తి చాకచక్యంగా వ్యవహరిస్తారు. కాకలు తీరిన రాజకీయ నాయకులను సైతం తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అందువల్లే ఆయన టీవీ 5 ఛానల్ సీఈవో అయ్యారు. మరోవైపు వ్యక్తిగత ఆరోగ్యం పై మూర్తికి విపరీతమైన శ్రద్ధ ఉంటుంది. అందువల్లే ఆయన తినే తిండిని సైతం ప్రేక్షకులతో పంచుకుంటారు. ఏమి తినాలో.. ఏమి తినకూడదో వీడియో రూపంలో చెబుతుంటారు. పైగా నేటి కాలంలో ఎలాంటి తిండి తింటే ఏమవుతుందో కూడా చెబుతారు. ఇక ఆ మధ్య ఓ సినిమాకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్లు నిర్వహించి కేసులు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలతో డిబేట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు మూర్తి. ముఖ్యంగా యువ నటిని ఉద్దేశించి ఇదేం పోయే కాలం అని మూర్తి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆ డిబేట్లో కూడా మూర్తి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.. ఈ డిబేట్ కొద్దిరోజులపాటు తెలుగు మీడియాలో చర్చకు దారి తీసింది.