Anil Ravipudi: మన ఇండస్ట్రీ లో రాజమౌళి తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ స్ట్రైక్ తో ముందుకు దూసుకుపోతున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనిల్ రావిపూడి(Anil Ravipudi) మాత్రమే. శ్రీను వైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో మొదలైన రావిపూడి కెరీర్, సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam) చిత్రం వరకు ఎలా సాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఈయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలు తీసి విసిగిపోయిన హీరోలు, ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేయాలని అనుకుంటే అనిల్ రావిపూడి కి ఓటు వేస్తారు. ఆ స్థాయి బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో , మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: బైక్ గిఫ్ట్ గా ఇస్తా… హీరో కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్, ఇలా చేస్తే చాలు, అది మీ సొంతం!
అనిల్ రావిపూడి లుక్స్ పరంగా చూసేందుకు అచ్చం హీరోలాగా ఉంటాడు. అదే విధంగా ఈయనకు హీరోల స్థాయిలో కామెడీ టైమింగ్ ఉంది, డ్యాన్స్ కూడా చేయగల్తాడు. ఈయన హీరో గా త్వరలో ఒక సినిమా చేయబోతున్నాడని. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా షూటింగ్ సమయంలో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అని, త్వరలోనే వీళ్ళు కలిసి హీరో హీరోయిన్లు గా సినిమాలు తీయబోతున్నారని ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అంతే కాదు ఈయన మీనాక్షి చౌదరి తో రహస్యంగా ప్రేమాయణం కూడా నడుపుతున్నట్టు పలు యూట్యూబ్ చానెల్స్ ప్రచారం చేసాయి. దీనికి అనిల్ రావిపూడి ఈ ఇంటర్వ్యూ లో చాలా ఘాటుగా స్పందించాడు. మళ్ళీ తనపై ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలంటే భయపడే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘మీనాక్షి చౌదరి తో నాకేదో కెమిస్ట్రీ కుదిరినట్టు యూట్యూబ్ లో కొంతమంది వీడియోలు చేసారు. అవి బాగా వైరల్ అయ్యాయి, మా ఆవిడ కి వాటిని వాట్సాప్ లో సన్నిహితులు పంపారు. బాబు దయచేసి నామీద ఇలాంటి వీడియోలు చేయకండి. నాకు, మీనాక్షి చౌదరి కి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ కుదర్లేదు. మీ టీఆర్ఫీ కోసం, వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్టు వీడియోలు చేయకండి. పైగా ఆ వీడియోలకు అందమైన వాయిస్ ఓవర్ లు ఇప్పిస్తూ, నిజమేనేమో అని జనాలు నమ్మే రేంజ్ లో వీడియోలు చేస్తున్నారు. ఎదో నాకు తోచిన సినిమాలు చేసుకుంటూ, నా భార్యతో సుఖంగా సంసారం చేసుకుంటున్నాను. దయచేసి చిచ్చులు పెట్టకండి. మర్యాదగా ఆ వీడియోలను తొలగించండి, నేను మీపై సైబర్ క్రైమ్ కేసు కూడా వేసాను. మీ చానెల్స్ కి స్ట్రైక్ పడకముందే వీడియోలను యూట్యూబ్ నుండి తొలగించేయండి’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: రజినీకాంత్ కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..? ఊచకోత అంటే ఇదేనేమో..?