Homeజాతీయ వార్తలుPM Modi: మోదీకి కోపమొస్తే అంతే..!

PM Modi: మోదీకి కోపమొస్తే అంతే..!

PM Modi: మోదీ.. భారత ప్రధాని.. తాను ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశవ్యాప్తంగా ముందు చర్చ జరిగేలా చూస్తారు. మారుమూల పల్లె నుంచి దేశ రాజధాని వరకు అందరూ చర్చించుకోవాలని భావిస్తారు. తర్వాత తాను తీసుకునే నిర్ణయం అందరికీ తెలిసేలా చేస్తారు. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోదీ తన చరిష్మాతో ప్రతిపక్షాలను కోలుకోలేకుండా చేస్తున్నారు. ఇక అదే సమయంలో విశ్వగురుగా ప్రపంచ దేశాలతో కీర్తించబడుతున్నారు. ఇటీవలే జీ20 సమావేశాలు ఘనంగా నిర్వహించి అగ్రదేశాల మన్ననలు పొందారు. భారత దేశాన్ని ఐదో ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారు. భారత్‌ను సూపర్‌ పవర్‌గా చేయడమే లక్ష్యం అంటారు మోదీ.. పైకి కూల్‌గా, మాటల్లో దేశ సేవే లక్ష్యంగా తన భావాలను వ్యక్తం చేసే మోదీకి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేశప్రజలకు మోదీ తన కోసం అస్సలు తెలియదు. తెలియనివ్వరు కూడా రాజకీయాల్లో ఉన్నవారికి కోసం వస్తే అది పతనానికి దారి తీస్తుంది. ఈ విషయం మోదీకి బాగా తెలుసు. అయితే మరి మోదీకి కోపం రాదా అంటే.. వస్తుంది.. మరి వస్తే ఏం చేస్తారో తెలుసా.. కేసీఆర్‌ తరహాలో కస్సుబుస్సుమనరు. ఆయన కోసం ఎలా ఉంటుందో మాజీ ఆర్థిక కార్యదర్శి తన పుస్తకంలో వివరించారు.

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ను తాచుపాములా..
ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్రగార్గ్‌ మోదీ కోసం గురించి తాను రాసిన పుస్తకంలో వివరించారు. ‘‘బీ ఆల్‌సో మేడ్‌ పాలసీ ఆర్‌ ఇన్‌సైడర్‌’’ పేరుతో గార్గ్‌ పుస్తకం రాశారు. దీనిని అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు. అయితే ఇందులో మోదీకి కోసం వస్తే ఎలా ఉంటుందో అని చెప్పేందుకు ఒక ఉదాహరన పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను డబ్బుల మూటపై కూర్చున్న తాచుపాముతో ప్రధాని పోల్చాడని రాసుకొచ్చారు.

అలా ఎందుకు పోల్చారంటే..
మోదీ ఆర్బీఐ మాజీ గవర్నర్‌ను అలా ఎందుకు పోల్చారో కూడా గార్గ్‌ తన పుస్తకంలో వివరించారు. 2018, సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పరిస్థితిపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ తన వద్ద ఉన్న అదనపు నిల్వలను ఉపయోగించుకునేందుకు గవర్నర్‌ అడ్డుపడుతున్నాడని నాటి గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌పై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట. పటేల్‌ గవర్నర్‌గా ఉన్నంత కాలం కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య విభేదాలను తన పుస్తకంలో గార్గ్‌ ప్రస్తావించారు.

ప్రభుత్వ విధానాలను విభేదించిన పటేల్‌..
పటేల్‌పై మోదీ కోపానికి కారణం కూడా గార్గ్‌ వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను ఉర్జిత్‌ పటేల్‌ విభేదించారట. ఎలక్ట్రోరల్‌ బాండ్లు, పేమెంట్‌ రెగ్యులేటరీ బోర్డు విషయంలో ప్రభుత్వానికి పటేల్‌ అడ్డుతగిలాడని పుస్తకంలో రాసుకొచ్చారు. డిజిటల్‌ చెల్లింపుల సమాచారం పూర్తిగా భారత్‌లోనే నిక్షిప్తం చేయాలని ఆర్బీఐ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు గార్గ్‌ తన పుస్తకంలో వెల్లడించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper