PM Modi: మోదీ.. భారత ప్రధాని.. తాను ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దేశవ్యాప్తంగా ముందు చర్చ జరిగేలా చూస్తారు. మారుమూల పల్లె నుంచి దేశ రాజధాని వరకు అందరూ చర్చించుకోవాలని భావిస్తారు. తర్వాత తాను తీసుకునే నిర్ణయం అందరికీ తెలిసేలా చేస్తారు. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోదీ తన చరిష్మాతో ప్రతిపక్షాలను కోలుకోలేకుండా చేస్తున్నారు. ఇక అదే సమయంలో విశ్వగురుగా ప్రపంచ దేశాలతో కీర్తించబడుతున్నారు. ఇటీవలే జీ20 సమావేశాలు ఘనంగా నిర్వహించి అగ్రదేశాల మన్ననలు పొందారు. భారత దేశాన్ని ఐదో ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారు. భారత్‌ను సూపర్ పవర్‌గా చేయడమే లక్ష్యం అంటారు మోదీ.. పైకి కూల్‌గా, మాటల్లో దేశ సేవే లక్ష్యంగా తన భావాలను వ్యక్తం చేసే మోదీకి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేశప్రజలకు మోదీ తన కోసం అస్సలు తెలియదు. తెలియనివ్వరు కూడా రాజకీయాల్లో ఉన్నవారికి కోసం వస్తే అది పతనానికి దారి తీస్తుంది. ఈ విషయం మోదీకి బాగా తెలుసు. అయితే మరి మోదీకి కోపం రాదా అంటే.. వస్తుంది.. మరి వస్తే ఏం చేస్తారో తెలుసా.. కేసీఆర్ తరహాలో కస్సుబుస్సుమనరు. ఆయన కోసం ఎలా ఉంటుందో మాజీ ఆర్థిక కార్యదర్శి తన పుస్తకంలో వివరించారు.
ఆర్బీఐ మాజీ గవర్నర్‌ను తాచుపాములా..
ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ మోదీ కోసం గురించి తాను రాసిన పుస్తకంలో వివరించారు. ‘‘బీ ఆల్‌సో మేడ్ పాలసీ ఆర్ ఇన్‌సైడర్’’ పేరుతో గార్గ్ పుస్తకం రాశారు. దీనిని అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు. అయితే ఇందులో మోదీకి కోసం వస్తే ఎలా ఉంటుందో అని చెప్పేందుకు ఒక ఉదాహరన పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను డబ్బుల మూటపై కూర్చున్న తాచుపాముతో ప్రధాని పోల్చాడని రాసుకొచ్చారు.
అలా ఎందుకు పోల్చారంటే..
మోదీ ఆర్బీఐ మాజీ గవర్నర్‌ను అలా ఎందుకు పోల్చారో కూడా గార్గ్ తన పుస్తకంలో వివరించారు. 2018, సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పరిస్థితిపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ తన వద్ద ఉన్న అదనపు నిల్వలను ఉపయోగించుకునేందుకు గవర్నర్ అడ్డుపడుతున్నాడని నాటి గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట. పటేల్ గవర్నర్‌గా ఉన్నంత కాలం కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య విభేదాలను తన పుస్తకంలో గార్గ్ ప్రస్తావించారు.
ప్రభుత్వ విధానాలను విభేదించిన పటేల్..
పటేల్‌పై మోదీ కోపానికి కారణం కూడా గార్గ్ వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను ఉర్జిత్ పటేల్ విభేదించారట. ఎలక్ట్రోరల్ బాండ్లు, పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు విషయంలో ప్రభుత్వానికి పటేల్ అడ్డుతగిలాడని పుస్తకంలో రాసుకొచ్చారు. డిజిటల్ చెల్లింపుల సమాచారం పూర్తిగా భారత్‌లోనే నిక్షిప్తం చేయాలని ఆర్బీఐ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు గార్గ్ తన పుస్తకంలో వెల్లడించారు.