Homeజాతీయ వార్తలుPetrol Price Hike: మధ్య తరగతిపై ‘పెట్రో’ బాంబ్‌.. ఇంటి బడ్జెట్‌ తలకిందులు..!

Petrol Price Hike: మధ్య తరగతిపై ‘పెట్రో’ బాంబ్‌.. ఇంటి బడ్జెట్‌ తలకిందులు..!

Petrol Price Hike: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతుందని విపక్షాలు పదే పదే చెబుతూ వస్తున్నాయి. కేంద్రం దీనిని కొట్టిపారిసేంది. కానీ అందరూ ఊహించిందే జరిగింది. ఎన్నికల అనంతరం కమర్షియల్‌గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెంచిన కేంద్రం, తాజాగా పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పైగా పెంచింది. ఇది సమాన్య, మధ్య తరగతి ప్రజలకు పెద్ద భారం. రోజువారీ అవసారాలపైనా ప్రభావం ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ను […]

Petrol Price Hike: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతుందని విపక్షాలు పదే పదే చెబుతూ వస్తున్నాయి. కేంద్రం దీనిని కొట్టిపారిసేంది. కానీ అందరూ ఊహించిందే జరిగింది. ఎన్నికల అనంతరం కమర్షియల్‌గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెంచిన కేంద్రం, తాజాగా పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పైగా పెంచింది. ఇది సమాన్య, మధ్య తరగతి ప్రజలకు పెద్ద భారం. రోజువారీ అవసారాలపైనా ప్రభావం ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది. ప్రత్యేకించి నగర మధ్యతరగతి, ఇళ్ల సర్వీసులపై ఆధారపడి ఉండే ప్రజలపై ఈ ప్రభావం ఎక్కువ.

ప్రాథమిక ప్రభావాలు..
పెట్రో ధరల పెంపుతో మొదటగా రవాణా చార్జీల పెరుగుతాయి. ఆటో, క్యాబ్‌ ఫేర్‌లు, లోకల్‌ బస్సు రేట్లు, ఇంటర్‌సిటీ బస్సుల చార్జీలు పెరుగుతాయి. ఇది ఉద్యోగాలకి వెళుతూ వచ్చిన ఖర్చును పెంచుతుంది. వేతనంలో కోత పడుతుంది. ఇక నిత్యావసరాలైన కూరగాయలు, పండ్లు, పాలు, రేషన్‌ వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా తాజా సరఫరాల్లో ట్రాన్స్‌పోర్ట్‌ భాగం పెద్ద భాగం కావడంతో ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, ఈకామర్స్‌ షిప్పింగ్‌ ఫీజులు, రికవరీ ఛార్జీలు పెరుగుతాయి. పరోక్షంగా… వ్యవసాయం (ట్రాక్టర్‌ ఇంధనము), నిర్మాణం (ప్రాజెక్ట్‌ డైమెండ్‌), లోజిస్టిక్స్‌ ఇంధన ఆధారిత వ్యయాలు పెరిగినప్పుడే ఉత్పత్తి ఖర్చు పైకి తీసుకుంటుంది.

మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం..
సామాన్య నగర కుటుంబం ఒక నెలలో కనీసం 5–8 శాతం అదనపు ఖర్చు భరించాల్సి వస్తుందని ఆర్థిక విశ్లేషణలు సూచిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్‌ బేస్డ్‌ ఉద్యోగాలు కలిగినవారు, పిల్లల స్కూల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు పెరిగి బడ్జెట్‌ లెక్కలు మారుతాయి. ఉపాధి ఆధారిత ఆదాయాలు మారుతుంటే వినియోగం తగ్గి ఎంఎస్‌ఎంఈల డిమాండ్‌ దెబ్బ తింటుంది. ఆర్థిక చక్రం నెగెటివ్‌లోకి వెళ్తుంది.

తక్షణ పరిష్కారాలు..
పేద, మధ్యతరగతికి నేరుగా ఇంధన/రవాణా సబ్సిడీలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపశమనం కలిగించాలి. బస్సు/మెట్రో ఫ్యార్స్‌లో రవాణా చార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. రైతులపై భారం పడకుండా సబ్సిడీలు పెంచాలి. స్థానిక సరఫరా గొలుసులను బలోపేతించడం ద్వారా తాజా ఉత్పత్తుల ధరలను నిలుపుకోవచ్చు. దీర్ఘకాలికంగా ప్రభావం తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలైన ఈవీ, సోలార్‌ వాహనాల వినియోగం పెంచాలి. లాజిస్టిక్స్‌ ఎఫిషియెన్సీ, ఫ్లీట్‌ మెనేజ్‌మెంట్‌ ద్వారా ఇంధన వినియోగాన్ని నవీకరించాలి. ఉపాధి గ్యారంటీ స్కీమ్స్‌ ద్వారా షార్ట్‌టర్మ్‌ ఇన్‌కం సపోర్ట్‌ ఇవ్వాలి.

లీటరుకు రూ.3 పెరిగినదే తక్కువగా అనిపించవచ్చు. కానీ అది సామాన్యుడి రోజువారీ జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. రోడ్‌ చార్జీల నుంచి నిత్యావసరాల వరకు అన్నీ పెరుగుతాయి. తక్షణ ఉపశమనం అవసరమే అయినప్పటికీ, దీర్ఘకాలిక, నిర్మాణాత్మక మార్పులు అవసరం. ప్రభుత్వం, పరిశ్రమలు, సామాజిక రంగం కలిసి చర్య తీసుకుని వినియోగదారుల బడ్జెట్‌ను రక్షించకపోతే తదుపరి కొన్నేళ్లలో సామాజిక, ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper