spot_img
Homeజాతీయ వార్తలుPetrol Price Hike India: పెట్రోల్ మీద ఐదు రూపాయలు.. సిలిండర్ మీద 50 రూపాయలు.....

Petrol Price Hike India: పెట్రోల్ మీద ఐదు రూపాయలు.. సిలిండర్ మీద 50 రూపాయలు.. మోత మోగిపోవడం ఖాయం

Petrol Price Hike India: మొన్ననే కదా కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి విలేకర్ల ముందుకు వచ్చి.. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ధరలు పెంచేది లేదు అని చెప్పింది.. ఆమె అలా చెప్పిందో లేదో.. ఇప్పుడు జాతీయ మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి. వాటి సారాంశం ఏంటంటే.. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయట. పెట్రోల్ మీద, డీజిల్ మీద లీటర్ కు నాలుగు నుంచి ఐదు రూపాయలు పెరిగే అవకాశం ఉందని ఇండియా టుడే లో ఒక వార్త కథనం ప్రసారం అయింది. ఇవి మాత్రమే కాదు ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందట. త్వరలో దీనిపై కేంద్రం ఒక కీలకపాటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే కమర్షియల్ గ్యాస్, 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు, జెట్ ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ధరల భారం తప్పదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే కేంద్రం ధరలు పెంచుతోందని ఇండియా టుడే లో ఓ వార్త కథనం ప్రసారమైంది. ఇప్పటికే మధ్య ఆసియాలో యుద్ధం వల్ల దేశ అవసరాలకు సరిపడా క్రూడ్ ఆయిల్ రావడం లేదు. క్రూడ్ ఆయిల్ రవాణా కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో చమురు సరఫరా విషయంలో కంపెనీలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర ఏకంగా 110 డాలర్లను మించిపోయింది. ఫలితంగా దేశీయ ఆయిల్ కంపెనీలకు విపరీతంగా నష్టం వస్తోంది. అందువల్లే ధరల పెంపు అనివార్యమని ఇండియా టుడే తన కథనంలో స్పష్టం చేసింది.

పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం అన్ని వాటి మీద ఉంటుంది. ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. పెట్రోల్ ఆధారిత ఉత్పత్తుల ధర కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ధరల స్థాయి మరింత పెరిగింది. ఫలితంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల స్థాయి ఇదే విధంగా ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.

ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి కేంద్రం ధరలు పెంచలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఫలితాలు వచ్చిన తర్వాత కచ్చితంగా ధరలు పెరుగుతాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే కేంద్రం ధరలు పెంచుతుండడం విశేషం. ఇండియా టుడే తన కథనంలో ప్రభుత్వ వర్గాలను ప్రస్తావిస్తూ స్టోరీ పబ్లిష్ చేసింది. బహుశా మరికొద్ది రోజుల్లో దేశంలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper