Homeఅంతర్జాతీయంDonald Trump China visit: అపనమ్మక భేటీలు.. ట్రంప్‌ సీక్రెట్‌ కమాండ్‌కు చైనా చెక్‌!

Donald Trump China visit: అపనమ్మక భేటీలు.. ట్రంప్‌ సీక్రెట్‌ కమాండ్‌కు చైనా చెక్‌!

Donald Trump China visit: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి చైనా పర్యటనకు వచ్చారు. రెండు రోజులు చైనాలో పర్యటించారు. అయితే అమెరికా – చైనా మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టారిఫ్‌ విషయంలో ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇక చైనా ఎదగకుండా చేయడమే లక్ష్యంగా ట్రంప్‌ పనిచేస్తుంటే.. అమెరికాను అగ్రస్థానం నుంచి దించి తాము నిలవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో డొనాల్డ్‌ […]

Donald Trump China visit: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి చైనా పర్యటనకు వచ్చారు. రెండు రోజులు చైనాలో పర్యటించారు. అయితే అమెరికా – చైనా మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టారిఫ్‌ విషయంలో ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇక చైనా ఎదగకుండా చేయడమే లక్ష్యంగా ట్రంప్‌ పనిచేస్తుంటే.. అమెరికాను అగ్రస్థానం నుంచి దించి తాము నిలవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఇలాంటి తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటన చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో అధ్యక్షుల స్థాయి సమావేశం రాజకీయంగా, భద్రతాపరంగా ఒక పరీక్షగా నిలిచింది. అప్పనమ్మకాల మధ్య అధ్యక్షుల భేటీ కీలకంగా మారింది. ఇదే సమయంలో వైట్‌ హౌస్‌ సిబ్బంది, అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ట్రంప్‌ భద్రత కోసం ఉపయోగించే డివైస్‌లను కూడా చైనా పనిచేయకుండా చేసింది.

చైనాలో పనిచేయాని మెరికా ట్రిక్కులు
రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ వెళ్లిన ట్రంప్‌ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ వేదికవద్ద చైనా మీడియా సిబ్బంది దూసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న అమెరికా ప్రతినిధులను తోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో ఒక అమెరికా ప్రతినిధి కిందపడి గాయపడ్డాడు. ఈ విషయమై చైనా ప్రతినిధులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆలయంలోకి అనుమతి నిరాకరణ..
ఇక చైనాలోని టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌ పరిధిలో ఇరు దేశాల అధ్యక్షులు సందర్శించారు. ఈ సమయంలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ వద్ద తుపాకీ ఉందన్న అతడిని టెంపుల్‌లోకి అనుమతించలేదు. ఆయుధాన్ని ఇచ్చి వెళ్లాలని సూచించారు. ఇందుకు అమెరికా ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సుమారు 30 నిమిషాల తర్వాత మరో సీక్రెట్‌ అధికారిని అనుమతించారు. గన్‌తో ఉన్న ఏజెంట్‌ బయటే ఉండిపోయాడు.

జర్నలిస్టులపై ఆంక్షలు..
ప్రెసిడెన్షియల్‌ కాన్వాయ్‌ చక్రంలో అమెరికా జర్నలిస్టులను అడ్డుకోవడం, హైడ్రేషన్‌ సదుపాయాలపై పరిమితులు పెట్టడం వంటి చర్యలు పర్యటన వ్యాపారిక పారదర్శకత లోపాన్ని ఎత్తి చూపాయి. ఒక దేశం ఆహ్వానించిన శిఖర సమావేశానికి రిపోర్టింగ్‌ ప్రధానం. కానీ దానిపైనే ఆంక్షలు పెట్టడం ద్వారా తాము అమెరికా వ్యతిరేకతను ప్రదర్శించింది. దీనిపై అమెరికా ప్రతినిధుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత చరిత్ర..
చైనా ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. 2017లో కూడా ట్రంప్‌ బీజింగ్‌ వెళ్లినప్పుడు గొడవలు జరిగాయి. ఇరువర్గాల మధ్య భద్రతా ప్రోటోకాల్‌లలో తేడాలు, ఇతర అంశాలు విభేదాలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో నమ్మకాన్ని తిరిగి నిర్మించడం, ప్రటోకాల్‌లపై స్పష్టమైన ఒప్పందం, మీడియా అనుమతిపై ముందస్తు అవగాహనల అవసరం.

చైనా భద్రతా విధానాలు, జాతీయ రీతులపై ప్రత్యేక హక్కులు వారికే ఉంటాయి. అయితే అతిథులు వచ్చినప్పుడు వీటి గురించి ముందే తెలియజేయాలి. ఇప్పటికే అమెరికా చైనా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ తరుణంలో రాజకీయ, వ్యూహాత్మక విధానాలు అవలంభించడం ద్వారా ఇరు దేశాలు అభాసుపాలవుతున్నాయి. ప్రోటోకాల్, భద్రతా సంస్కృతి, మీడియా పరస్పర క్రియల సమన్వయమై నడవాలి. లేకుంటే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారుతాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper