Pakistan : ఇవీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులతో ఆదివారం భేటీ అయిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.. ఆపరేషన్ సిందూర్ విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ” చాలామంది ఈ ఆపరేషన్ అయిపోయిందని అనుకుంటున్నారు. ఇది ఇంకా పూర్తి కాలేదు. దీని లక్ష్యం వేరే ఉంది. ముష్కర దేశం మనం కోరిన ఉగ్రవాదులను అప్పగించాలి. పిఓకే ను మనకు ఇవ్వాలి. అప్పుడే కదా మనం అనుకున్న టార్గెట్లు పూర్తయ్యేది. టార్గెట్లు పూర్తిగా కాకముందే యుద్ధం ఎలా ముగుస్తుంది. అగ్రరాజ్యం చెప్పింది కాబట్టి సైలెంట్ అయ్యాం.. అంతేతప్ప వెనక్కి తిరిగి రాలేదు. మన సమయమనంతో ఉంటే వారేదో రెచ్చిపోయారు.. మనవాళ్లు చూస్తూ ఊరుకోరు కదా.. సినిమా చూపిస్తున్నారు. ఇప్పటికే 10 ఎయిర్ బేస్ లను కాల్చిపడేశారు. ఆ మంటల్లో పాకిస్తాన్ అప్పటికే చచ్చిపోయింది. ఇక కొత్తగా అది చావడానికి ఏముంది.. ఉగ్రవాద దేశం ఎప్పుడో పారిపోయింది. అసలు అది సీన్లో కూడా లేదు. ఇప్పుడు మన లక్ష్యాలు వేరే ఉన్నాయి. అవి నెరవేర్చుకునే వరకు పోరాటం చేయక తప్పదని” నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Also Read : పాక్ పని అయిపోయింది.. అందుకే అమెరికా ఎంట్రీ.. లేకపోతే కథ వేరే విధంగా..
ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదు..
ప్రపంచ పెద్దన్న భారత్ – పాక్ మధ్య ఫైరింగ్ స్టాప్ చేయడానికి కీలకపాత్ర పోషించినట్టు చెప్పుకుంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ప్రధానిపై ఒత్తిడి పెరిగిపోయింది. సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే మీడియా వరకు విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రమంలోనే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన ఒకటి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో.. ఈ దేశం కూడా జోక్యం చేసుకోలేదని స్పష్టత ఇచ్చింది. దీనిని బట్టి భారత్ ఏ దేశం ముందు తలవంచడం లేదని.. తలవంచే అవకాశం లేదని స్పష్టత ఇచ్చింది. మొత్తంగా చూస్తే ముష్కర దేశానికి ఒకటి రెండు మినహా ఏ దేశాలు కూడా సపోర్ట్ గా లేవు. భారతదేశాన్ని చూసి కూడా సపోర్ట్ గా వస్తే.. ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ గా ఇండియా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా అగ్ర రాజ్యంగా నిలబడాలంటే.. చైనా అగ్రరాజ్యంగా ఎదగాలంటే ఇండియా సపోర్ట్ కచ్చితంగా కావాలి. అంతటి కరోనా సమయంలో కూడా ప్రపంచానికి ఇండియా నే వ్యాక్సిన్లు ఇచ్చింది. అమెరికా వల్ల కాలేదు. చైనా చేయలేదు. జర్మనీ వల్ల సాధ్యం కాలేదు. రష్యా ఆ దిశగా ఆలోచించలేదు. ఇక మిగతా డెవలప్డ్ కంట్రీస్ ముందడుగు వేయలేదు.. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా సపోర్ట్ లేకపోతే ఏ కంట్రీస్ కూడా అంత ఈజీగా ప్రపంచం మీద పెత్తనం సాగించలేవు. నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసిన తర్వాత అటు అమెరికా.. ఇటు మిగతా దేశాలు జస్ట్ సైలెంట్ అయిపోయాయి. ఏం జరుగుతుందో చూద్దామని ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ నరేంద్ర మోడీ చెప్పినట్టు పిఓకే, ముష్కరుల హ్యాండ్ ఓవర్ వంటి వాటిని పాకిస్తాన్ చేయగలిగితే.. భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకున్నట్టే. ఇవే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి జీవితకాల నష్టం తప్పదు.
Also Read : భారత్–పాక్ యుద్ధం.. మనకు మిత్రులెవరో.. శత్రువులెవరో తెలిసింది