India Vs Pakistan: కానీ నెత్తి మాసిన అగ్రరాజ్యం అలా ఉండదు కదా.. పైగా ఇప్పుడు డ్రాగన్ దేశం ప్రపంచం మీద పెత్తనం కోసం తాపత్రయ పడుతోంది కదా.. అందువల్లే తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి వచ్చినట్టు.. అగ్రరాజ్యం వచ్చింది. యుద్ధాన్ని ఆపినట్టు.. రెండు దేశాలకు హితబోధ చేసినట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ ఇక్కడ అసలు విషయాన్ని మర్చిపోయింది. ఆ ఉగ్రవాద దేశంలో.. సైన్యానికి.. ప్రభుత్వానికి సయోధ్య వుండదని.. సైన్యం చెప్పినట్టే ప్రభుత్వం వింటుందనే ప్రపంచ పెద్దన్న మర్చిపోయింది. అందువల్లే ఉగ్రవాద దేశం మళ్లీ ఫైరింగ్ మొదలుపెట్టింది. అందువల్లే భారత్ గట్టిగా బదులిస్తోంది. భారత్ ఫస్ట్ చేసిన టెర్రర్ ఎటాక్ కు సంబంధించి సైలెంట్ గా ఉన్న అగ్రరాజ్యం.. ఒకసారిగా ఎంట్రీ ఇవ్వడానికి అసలు కారణం వేరే ఉంది.. అది అమెరికాకు కూడా షాక్ తెప్పించింది.
ఇంతకీ ఏం జరిగింది అంటే
ఉగ్రవాద దేశానికి చెందిన ఎయిర్ఫోర్స్ విభాగానికి 10 ఎయిర్ బేస్ లు ఉన్నాయి. వీటిని ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్స్ ద్వారా బద్దలు కొట్టింది. దానికంటే ముందు ఉగ్రవాద దేశం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడం వల్ల ఇండియా ఈ డిసిషన్ తీసుకుంది. అయితే ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ వార్ కు దారి తీసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అమెరికా.. ఇతర దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. అందువల్లే అవి ఇండియాను ఒప్పించగలిగాయి. ఇక్కడ నరేంద్ర మోడీ అగ్రరాజ్యానికి తలవంచింది లేదు.. అగ్రరాజ్యం చెప్పినట్టు తల ఊపిందీ లేదు. అయితే ఎప్పుడైతే నిన్న సాయంత్రం తర్వాత ముష్కర దేశం మళ్లీ ఫైరింగ్ మొదలు పెట్టిందో.. భారత్ ఇక ఏమాత్రం ఆగడం లేదు.. దీపావళి సినిమా చూపిస్తోంది..
ఏడాదికి 100 బ్రహ్మోస్ మిస్సైల్స్ తయారీ
ముష్కర దేశంతో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మోస్ మిస్సైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఓపెన్ అయింది… 300 కోట్ల ఖర్చుతో.. 80 హెక్టార్లలో ఈ యూనిట్ నిర్మించారు. ప్రతి ఏడాదికి 100 మిస్సైల్స్ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే రోజుల్లో వీటి సంఖ్యను 150కి పెంచుతాయి. వీటిని ఎర్త్, స్కై, విండ్ నుంచి లాంచ్ చేయవచ్చు. అన్నట్టు ముష్కర దేశంతో బార్డర్లో వివాదం మొదలైన తర్వాత.. భారత్ అర్జంట్ బేసిక్ మోడ్లో ఈ యూనిట్ ఓపెన్ చేయడం విశేషం. అయితే ఈ మిస్సైల్స్ సంఖ్యను పెంచుకోవడం ద్వారా.. భారత తన శత్రు దేశాలకు దీపావళి పండుగను పరిచయం చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ మిసైల్స్ ద్వారానే ఇండియన్ ఆర్మీ ముష్కర దేశానికి చుక్కలు చూపించింది. కనివిని ఎరుగని స్థాయిలో నష్టాన్ని చేకూర్చింది. తద్వారా ఉగ్రవాద దేశానికి భారత్ సత్తా ఏమిటో తెలియ వచ్చింది.