Operation Sindoor: ఉగ్రవాద దేశంలో చోటు చేసుకున్న నష్టానికి ఆ దేశ ఆర్మీ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది..” టెర్రరిస్ట్ కంట్రీలో భారీగా నష్టం వాటిల్లింది. ఈనెల తొమ్మిది, 10 తేదీలలో మా ఎయిర్ బేస్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేశారు. మేము సమర్థవంతంగా తిప్పి కొట్టాం. ముఖ్యంగా చైనా తయారు చేసిన PL -15 మిస్సైల్స్ ను టెర్రరిస్ట్ కంట్రీ ప్రయోగించింది. దానిని ఆకాష్ మిస్సైల్స్ తో గట్టిగా దెబ్బ కొట్టాం. మా ఆర్మీ చేసిన ఎటాక్ లో నూర్ కాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసం అయింది. పాకిస్తాన్ ఆర్మీ మా వైపు దాడులు చేసింది. అయితే సమర్థవంతమైన వ్యవస్థ కారణంగా స్వల్ప నష్టంతో బయటపడ్డామని” ఎయిర్ మార్షల్ భారతీ అభిప్రాయపడ్డారు.. దీనికంటే ముందు త్రివిధ దళాలకు చెందిన అధిపతులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ” ఈనెల 7న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాం. అందులో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. మా లెక్క ప్రకారం 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. కానీ శత్రుదేశం ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తోంది. మాపై దాడులకు పాల్పడుతోంది. ఇలాంటి సమయంలో మా దేశానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టం అడ్డుగోడగా నిలిచింది. పిఓకే లో మేము చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాద దేశంలో కిరానా హిల్స్ పై న్యూక్లియర్ ప్లాంట్లో ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. వాటిని మా దేశానికి చెందిన మిస్సైల్స్ ఢీకొట్టాయని శత్రుదేశం ఆరోపిస్తోంది. ఒకవేళ అక్కడ ఆ నిర్మాణాలు ఉన్నట్టు గనుక మాకు తెలిస్తే దాడులు వేరే విధంగా ఉండేవి. ఇన్ఫర్మేషన్ చెప్పారు కాబట్టి చాలా థాంక్స్” అని త్రివిధ దళాధిపతులు వెల్లడించారు.
Also Read: ఒక్క నిమిషంలో ఆరు అబద్ధాలు చెప్పిన పాక్.. వీడియో వైరల్
గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
త్రివిధ దళాధిపతులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. భారత ఆర్మీ దాయాది దేశంపై చేసిన దాడులకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేశారు. ఈ క్రమంలో మన సామర్థ్యాన్ని.. మన గగనతలాన్ని పరిరక్షించే వ్యవస్థ గురించి ప్రముఖంగా వివరించారు. ఈ వీడియో చూసేందుకు అద్భుతంగా ఉంది. 1000 యాక్షన్ సినిమాలకు మించి ఉంది. ఒకరకంగా ఆ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దాయాది దేశంపై మన ఆర్మీ సాగించిన దాడులు అద్భుతంగా ఉన్నాయి. అందువల్లే పాకిస్తాన్ ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ.. ఎన్ని రకాలుగా మనపై దాడులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. మన గగనతల రక్షణ వ్యవస్థ గోడలాగా అడ్డుకుంది. చివరికి పాకిస్తాన్ పరువును ప్రపంచ దేశాల ముందు తీసి పడేసింది. అయితే పాకిస్తాన్ త్రివిధ దళాధిపతులు విడుదల చేసిన వీడియోలకు.. మన దేశానికి చెందిన త్రివిధ దళాల అధిపతులు విడుదల చేసిన వీడియోలకు చాలా వ్యత్యాసం ఉంది. మన వీడియోలు మొత్తం అత్యంత సహజంగా ఉంటే.. పాకిస్తాన్ విడుదల చేసిన వీడియో కార్టూన్ సినిమా మాదిరిగా ఉంది. పైగా పాకిస్తాన్ ఆర్మీ అడ్డగోలుగా అబద్ధాలు ఆడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు.
View this post on Instagram