OG: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం ఈ ఏడాది కచ్చితంగా విడుదల అవ్వబోతుంది అని ఒక క్లారిటీ అభిమానులకు వచ్చేసింది. గత కాలంగా షూటింగ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఫుల్ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్, రీసెంట్ గానే సమయం కుదురించుకొని ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ కేటాయించి దానిని పూర్తి చేసాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల నూటికి నూరు శాతం లాంఛనమే. ఇక ఓజీ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ని కేటాయిస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇది రూమర్ అని చాలా మంది అనుకున్నారు కానీ, నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించాడు. నేటి నుండి షూటింగ్ కార్యక్రమాలు తాడేపల్లి లో మొదలయ్యాయి.
Also Read: పాకిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే?
అందుకు సంబంధించిన ఒక ఫోటో ని అప్లోడ్ చేస్తూ డీవీవీ దానయ్య వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. ‘మళ్ళీ మొదలైంది..ఈసారి ముగిద్దాం’ అంటూ వేసిన ఒక ట్వీట్ ని అభిమానులు ఆనందం తో రీట్వీట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఓజీ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన సోషల్ మీడియా మొత్తం ఊగిపోతూ ఉంటుంది. వేలకొద్దీ లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియా పరిస్థితి అలాగే ఉంది. దీనికే ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టిన ఫోటో ఒకటి విడుదల చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేడు అప్లోడ్ చేసిన ఫోటో సుజిత్ పక్కన కూర్చున్న వ్యక్తి సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస. ఇంతకు ముందు ఈ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు.
ఆయన వర్క్ అభిమానులకు చాలా నచ్చింది. ఓజీ గ్లింప్స్ లోని షాట్స్ ని , కెమెరా యాంగిల్స్ ని చూసి అభిమానులు ఇప్పటికీ మురిసిపోతూనే ఉంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా సినిమాటోగ్రాఫర్ మార్పు చెందడంతో కాస్త ఫ్యాన్స్ లో భయం మొదలైంది. కానీ కొత్తగా వచ్చిన సినిమాటోగ్రాఫర్ కూడా చిన్నోడు కాదు. మనోజ్ పరమహంస. ఎన్నో పాన్ ఇండియన్ చిత్రాలకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ని అందించాడు. ఆయన పని చేసిన సినిమాలలో ‘లియో’ చిత్రం పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది. అందుకే తన ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా మనోజ్ ని పెట్టుకున్నాడు. కాబట్టి అభిమానులు ఔట్పుట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, మనోజ్ పనితనం కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుండి షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెడుతున్నాడు. దాదాపుగా పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Malli Modhalaindi…. Eeesaari Mugiddaaam… #OG #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/gvvsS3q2PQ
— DVV Entertainment (@DVVMovies) May 12, 2025