Homeజాతీయ వార్తలుOperation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌: మరో సంచలన నిజం.. పాకిస్తాన్ అందుకే భయపడిందా?

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌: మరో సంచలన నిజం.. పాకిస్తాన్ అందుకే భయపడిందా?

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌పై గతేడాది మేలో ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఇందులో భారత వాయుసేన పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలసు ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్‌ ప్రతిదాడులు మొదలు పెట్టింది. దీంతో భారత్‌ వాటిని తిప్పికొట్టింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన సుమారు 500 మందికిపైగా సైనికులు మరణించారు. భారత వాయుసేన దాడిలో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌ బేస్‌లు దెబ్బతిన్నాయి. భారత వాయుసేన అణ్వాయుధ కేంద్రం […]

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌పై గతేడాది మేలో ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఇందులో భారత వాయుసేన పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలసు ధ్వంసం చేసింది. వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్‌ ప్రతిదాడులు మొదలు పెట్టింది. దీంతో భారత్‌ వాటిని తిప్పికొట్టింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన సుమారు 500 మందికిపైగా సైనికులు మరణించారు. భారత వాయుసేన దాడిలో పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌ బేస్‌లు దెబ్బతిన్నాయి. భారత వాయుసేన అణ్వాయుధ కేంద్రం కిరాణా హిల్స్‌పై దాడి చేసిందని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. భారత్‌ ఒక వీడియో విడుదల చేసినా, అధికారులు దాడిని ఖండించలేదు. పాకిస్తాన్‌ ఎయిర్‌ బేస్‌లపై దాడులను మాత్రం ధ్రువీకరించారు.

కిరాణాహిల్స్‌..అణ్వాయుధ కేంద్రం..
కిరాణాహిల్స్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో దాడి చేశారా అని ఒక ఎయిర్‌ఫోర్స్‌ అధికారిని విలేకరి ప్రశ్నించారు. దానికి భారత వాయుసేన అధికారి ’థాంక్యూ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌’ అని స్పందించారు. దాడి జరగలేదని తేల్చలేదు. అమెరికన్‌ విమానం సౌదీ అరేబియా నుంచి బోరాన్‌ను పాకిస్తాన్‌కు తరలించడం, అణు లీకేజీ నియంత్రణకు సంబంధం ఉందని అంచనా. ఇది దాడి జరిగినట్టు సూచిస్తోంది.

నూర్‌ఖాన్‌ ఎయిర్‌ బేస్‌ ధ్వంసం..
నూర్‌ఖాన్‌ ఎయిర్‌ బేస్‌పై భారత దాడి వీడియోలు విడుదలయ్యాయి. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దీన్ని అంగీకరించారు. దాడి విషయాన్ని తనకు ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ ఫోన్‌ చేసి చెప్పారని వెల్లడించారు. అయితే ఈ స్ట్రాటజిక్‌ వార్‌ సాంప్రదాయ యుద్ధం అణు స్థాయికి ఎదగకుండా భారత్‌ చర్యలు తీసుకుంది.

అణ్వాయుధాలతో బెదిరించిన పాకిస్తాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత సైలెంట్‌ అయింది. కిరాణా హిల్స్‌పై దాడి జరగకపోవచ్చు కానీ, భారత్‌ దాడి సామర్థ్యాన్ని నిరూపించింది. శత్రువుల్లో భయాన్ని పెంచింది. అమెరికా యుద్ధం ఆపాలని ఒత్తిడి తెచ్చినా, ఈ ఆపరేషన్‌ భారత వ్యూహాత్మక ఆధిపత్యాన్ని చాటింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper