Homeజాతీయ వార్తలుNarendra Modi: నరేంద్ర మోడీ స్ట్రాంగ్ డెసిషన్.. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, చైనాకు చెక్..

Narendra Modi: నరేంద్ర మోడీ స్ట్రాంగ్ డెసిషన్.. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, చైనాకు చెక్..

Narendra Modi: ఒకే ఒక్క నిర్ణయం.. భారతదేశాన్ని మరింత బలోపేతం చేసింది. నరేంద్ర మోడీ తీసుకున్న ఒకే ఒక్క స్టెప్ మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్ కు ఏకకాలంలో చెక్ పెట్టింది. ఫలితంగా భారతదేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం సాధ్యమైంది. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూర దృష్టి వల్ల. మన దేశానికి పాకిస్తాన్, చైనాతో నిత్యం గొడవలే. పహల్గాం ఘటన వల్ల మన దేశం ఎంతగా ఇబ్బంది పడింది.. పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదం వల్ల […]

Narendra Modi: ఒకే ఒక్క నిర్ణయం.. భారతదేశాన్ని మరింత బలోపేతం చేసింది. నరేంద్ర మోడీ తీసుకున్న ఒకే ఒక్క స్టెప్ మన శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్ కు ఏకకాలంలో చెక్ పెట్టింది. ఫలితంగా భారతదేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం సాధ్యమైంది. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూర దృష్టి వల్ల.

మన దేశానికి పాకిస్తాన్, చైనాతో నిత్యం గొడవలే. పహల్గాం ఘటన వల్ల మన దేశం ఎంతగా ఇబ్బంది పడింది.. పాకిస్తాన్ చేసిన ఉగ్రవాదం వల్ల ఎంత నరకం చూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ దేశానికి చైనా ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంటుంది. చైనాతో గతంలో గాల్వాన్ లోయలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. అటు చైనాతో.. ఇటు పాకిస్తాన్ దేశంతో నిత్యం మనకు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.

ఈ రెండు దేశాల వల్ల భారత్ నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉంటుంది. అందువల్లే మన దేశ సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిఫెన్స్ కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం అత్యున్నత కీలకమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో దాదాపు లక్ష కోట్ల కంటే ఎక్కువ విలువైన డిఫెన్స్ ప్రాజెక్టులకు ఆమోదం వ్యక్తం చేయబోతున్నారు. త్రివిధ దళాల ఆధునీకరణతో పాటు.. ఇంకా అత్యంత కీలకమైన ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటుంది.

ఈ కేటాయింపుల్లో ఎక్కువ శాతం ఇండియన్ ఆర్మీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తారని సమాచారం. 300 k9 వజ్ర శతఘ్ని ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ వీటిని తయారు చేస్తున్నాయి. అంతేకాకుండా లాయిటరింగ్ మ్యూనిషన్స్ ను కూడా సేకరిస్తారని తెలుస్తోంది.

శత్రు దేశాల నుంచి వైమానిక దాడులు గనుక ఎదురైతే.. వాటిని తిప్పి కొట్టడానికి రష్యా నుంచి అత్యంత ఆధునికమైన వెర్బా మ్యాన్ ప్యాడ్స్ కొనుగోలు చేస్తారు. ఇవి శత్రు దేశాలకు సంబంధించిన విమానాలను.. హెలికాప్టర్లను.. డ్రోన్లను గాలిలోనే కూల్చి వేస్తాయి. మన దేశానికి సంబంధించిన యుద్ధ ట్యాంకులు.. సాయుధ వాహనాల భద్రత కోసం.. అత్యంత శక్తివంతమైన ఆక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ కొనుగోలు పై ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

ఇది మాత్రమే కాకుండా లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిస్సయిల్స్.. ఎయిర్ టు ఎయిర్ రీ ఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు.. స్వయం ప్రతిపత్తి ఉన్న వాహనాలు.. అత్యంత భారీ రకానికి చెందిన టార్పేడోలు.. వంటి వాటిని కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా లోనే తయారు చేస్తారని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper