Homeఅంతర్జాతీయంNaila Qadri Balochistan: ఇండియాలో ఉండి లేకి పాక్ కు సపోర్ట్ చేసేవాళ్లు.. చూడాల్సిన వీడియో...

Naila Qadri Balochistan: ఇండియాలో ఉండి లేకి పాక్ కు సపోర్ట్ చేసేవాళ్లు.. చూడాల్సిన వీడియో ఇది!

Naila Qadri Balochistan: ఎస్.. మనకు ఎప్పటినుంచో ఉగ్రవాద దేశం శత్రువు. మామూలు శత్రువు కాదు.. మన దేశంలో బాంబులు వేసింది. మన దేశ ప్రజల ప్రాణాలు తీసింది. మనకుకె శత్రువులుగా ఉన్న దేశాలతో అంటకాగింది. ఒక రకంగా మన దేశానికి నరకం చూపించింది. ఉగ్రవాద దేశం చేసిన దురాఘతాల వల్ల మనం పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇంకానూ చేస్తూనే ఉన్నాం. అయితే ఈ రావణ కాష్టం ఎన్నడు ఆగిపోతుందో తెలియదు. దీనికి ముగింపు ఎప్పుడో కూడా అర్థం కావడం లేదు.. ఉగ్రవాదాన్ని తొక్కి వేయాలని అనుకుంటుంటే.. నెత్తి మాసిన అమెరికా అడ్డు తగులుతోంది. పైగా పాకిస్తాన్ , భారత్ ఈక్వల్ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతోంది.. ఇక ఇలాంటి సమయంలో మనదేశంలో ఉంటూ ఉగ్రవాద దేశమైన పాక్ కు సపోర్ట్ చేస్తున్న కూహానా సన్నాసులు, వెదవలుఓ చాలామంది ఉన్నారు. ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చితే కన్నీరు పెడతారు. నది ఒప్పందాలను రివర్స్ తీసుకుంటే తప్పు పడతారు. ఆందోళనలు కూడా చేస్తారు. పైగా ఉగ్రవాద దేశానికి తిరుగులేని సపోర్ట్ ఇస్తారు. ఈ దేశం గాలి పీల్చుతూ, నీరు తాగుతూ, ఆహారం తింటూ.. మన దేశానికి వెన్నుపోటు పొడుస్తారు.. అయితే అలాంటివారికి బలూచిస్థాన్ ప్రధానమంత్రి నైలా ఖదారీ తిరుగులేని సమాధానం చెప్పారు. ఆమె ఇండియాలో ఉంటూ.. ఇండియాకు వెన్నుపోటు పొడుస్తున్న వారికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు.

Also Read: ట్రంప్‌పై హత్యా బెదిరింపు ఆరోపణలు.. జేమ్స్‌ కామీ ‘86 47’ పోస్ట్‌తో వివాదం

రొమ్ము ఎలా గుద్దుతారు..

“తల్లిపాలు తాగినప్పుడు.. కచ్చితంగా ఆమె మీద గౌరవం ఉండాలి. ఆ సంస్కారాన్ని ప్రదర్శించాలి. అంతేతప్ప పాలు తాగినంతసేపు మాత్రమే మమకారాన్ని చూపి.. ఆ తర్వాత అడ్డగోలుగా ప్రవర్తించకూడదు. భారత్ అంటే గొప్ప దేశం. ఇంతవరకు ప్రపంచంలో భారత్ మరొక దేశంపై దండయాత్ర చేయలేదు. యుద్ధం చేయలేదు.. తన ప్రయోజనాలకు అనుగుణంగా ఇతర దేశాలను వాడుకోలేదు. కేవలం రాజ్యాంగబద్ధంగా మాత్రమే వ్యవహరించింది. సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించింది. ఏ మాత్రం అడ్డగోలుగా పనులు చేయలేదు. కానీ ఇప్పుడు ఉగ్రవాద దేశంపై భారత్ దాడి చేస్తుంటే.. భారత్లో ఉన్నవారు విమర్శలు చేయడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతటి ఉగ్రవాద దేశంలో కూడా భారత్ అంటే పడి చచ్చేవారు చాలా మంది ఉన్నారు. భారత్ లో ఉన్న స్వేచ్ఛను చూసి హర్షం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. తమను భారతదేశంలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇండియాలో ఉన్న వారికి అది అర్థం కావడం లేదు. ఇండియా గొప్పతనం వారికి అవగతం కావడం లేదు. ఇలాంటి దిక్కుమాలిన మనస్తత్వం ఉన్న వ్యక్తులు కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటారేమో. అలాంటివారికి ఎలాంటి శిక్ష విధించినా ఏమీ కాదు. ఎందుకంటే దేశం ముందు ఏదీ ఎక్కువ కాదు.. వ్యవస్థలను ధిక్కరించి ప్రవర్తించే వారికి కచ్చితంగా ఏదో ఒక శిక్ష పడాలి. అలాంటి శిక్ష పడితేనే వారు తమ నోరులను అదుపులో పెట్టుకుంటారని” బలూచిస్థాన్ ప్రధానమంత్రి నైలా ఖదారీ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు ఈ వీడియోను బిజెపి అనుకూల నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు.

“మన దేశం గొప్పతనం ఇతర దేశ పరిపాలకులకు తెలుస్తోంది. ఇక్కడున్న వారికి మాత్రం మన దేశం గొప్పతనం అర్థం కావడం లేదు. అసలు ఇలాంటి ప్రజలు కేవలం ఇక్కడ మాత్రమే ఉంటారు కావచ్చు. ఇప్పటికైనా మించి పోయింది లేదు ఇలాంటి వారి ప్రసంగాలు చూసైనా సరే వారు మారాలి. లేకుంటే అదే ఉగ్రవాద దేశానికి వెళ్లిపోవాలని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular