spot_img
Homeజాతీయ వార్తలుకరోనాతో అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకున్న మోడీ

కరోనాతో అనాథలైన పిల్లలను అక్కున చేర్చుకున్న మోడీ

కరోనా ఎంతో మందిని చంపేసింది. ఎంతో మందిని అనాథలు చేసింది. తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. నిత్యం లక్షల కేసులు, వేలసంఖ్యలో మరణాల్లో ఈ అనాతల సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా రక్తసంబంధాలను తెంచింది. పేగు బంధాలను తుంచింది.పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు ప్రధాని మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. వారి కన్నీళ్లు తుడిచేందుకు డిసైడ్ అయ్యారు.

కరోనా ప్రభావంతో గత ఏడాది నుంచి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబ పెద్ద మరణించడంతో తినడానికి తిండి లేక అలమటిస్తున్న వారు ఎందరో ఉన్నారు.

ఇలా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లల కోసం పీఎం కేర్స్ ఫర్ ‘చిల్డ్రన్ ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు.

కరోనాతో అనాథలైన పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. ప్రైవేటు విద్యాసంస్థలు లేదా కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూళ్లలో ఉచితంగా వీరికి విద్య అందిస్తారు. యూనిఫామ్స్, బుక్స్ ఇతర ఖర్చులన్నీ పీఎం కేర్స్ భరిస్తుంది. వీరికి 18 ఏళ్లు నిండిన తర్వాత నెల నెలా స్టైఫండ్ అందిస్తారు. చదువుతోపాటు ఇతర ఖర్చులకు ఇది ఉపయోగపడుతుంది. 23 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షలు ఇస్తారు. ఉన్నత చదువుల కోసం రుణాలను ఇప్పిస్తారు. ఆ లోన్ వడ్డీని పీఎం కేర్స్ నుంచి చెల్లిస్తారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయుష్మాత్ భారత్ స్కీమ్ కింద రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పిస్తారు. దానికి పీఎం కేర్స్ నుంచే ప్రీమియం చెల్లిస్తారు.

ఇలా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ పథకం ప్రకటించి ప్రధాని మోడీ పేర్కొన్నారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Oktelugu Epaper