
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా 21 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 3,247కి చేరింది. 36,917 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 3,837 మంది కోలుకున్నట్లు తెలిపింది. దేశంలో రాష్ట్రంలో రికవరీ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు జాతీయ సగటు తో పోలిస్తే రాష్ట్రంలో 0.56 గా ఉందని తెలిపింది.