Homeజాతీయ వార్తలుLok Sabha Elections 2024 : తెలంగాణ సీట్లపై ‘కమ్మ’ వారి కన్ను.. ఆ రెండు...

Lok Sabha Elections 2024 : తెలంగాణ సీట్లపై ‘కమ్మ’ వారి కన్ను.. ఆ రెండు స్థానాలకు పట్టు!

Lok Sabha Elections 2024 : మరో పది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రధాని మోదీ మరోమారు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈనెల 4, 5వ తేదీల్లో పర్యటించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. బీఆర్‌ఎస్‌ కూడా అభ్యర్థుల వేటలో పడింది.

ఆ రెండు స్థానాలపై కమ్మల నజర్‌..
తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ నాయకులు విజయం సాధించలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కమ్మలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ తరుణంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అయినా కమ్మ నాయకులను గెలిపించుకోవాలని ఆ సామాజికవర్గం భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కమ్మలకు రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతోంది. మల్కాజ్‌గిరితోపాటు, ఖమ్మం లోక్‌సభ సీట్లు కమ్మలకే కేటాయించాలని నాయకులు కోరుతున్నారు.

అధికార పార్టీకి వినతి..
మల్కాజ్‌గిరి, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కమ్మలకే కేటాయించాలని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధులకు విన్నవించారు. అయితే ఖమ్మం స్థానానికి ఇప్పటికే భట్టి విక్రమార్క భార్య, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. రేణుకాచౌదరి కమ్మ నేత అయినప్పటికీ ఆమెకు రాజ్యసభ టికెట్‌ ఇచ్చారు. దీంతో లోక్‌సభ టికెట్‌ కూడా కమ్మలకే ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కానీ కాంగ్రెస్‌ ఆ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రెస్‌క్లబ్‌ వేదికగా గురువారం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కమ్మలకు అన్ని పార్టీలు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

మల్కాజ్‌గిరి ఎందుకంటే..
మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ ఉత్తరాది ప్రజలతోపాటు, ఆంధ్రా సెటిలర్స్‌ ఎక్కువగా ఉంటారు. మినీ ఇండియాగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి కమ్మ నేతలకు టికెట్‌ ఇస్తే ఈజీగా గెలుస్తారని భావిస్తున్నారు. అందుకే మల్కాజ్‌గిరి టికెట్‌ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన నాయకుడు లేడు. దీంతో కమ్మ నేతకు టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటామని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper