spot_img
Homeజాతీయ వార్తలుRythu Runa Mafi: అన్నదాతకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌.. రుణ మాఫీపై కీలక నిర్ణయం

Rythu Runa Mafi: అన్నదాతకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌.. రుణ మాఫీపై కీలక నిర్ణయం

Rythu Runa Mafi: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినందున హామీలు నెరవేర్చడంపై రేవంత్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కీలక అప్‌డేట్‌ బయలకు వచ్చింది. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

అమలు చేయకుంటే..
రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది. ఇది అమలు చేయని కారణంగానే గత బీఆర్‌ఎస ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ అమలు చేయకుంటే సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రుణమాఫీపై లక్షల మంది ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల బడ్జెట్‌ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రుణమాఫీ జరుగుందని ప్రకటించారు.

వివరాల సేకరణ షురూ..
ఈ క్రమంలో ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి రైతు రుణమాఫీపై కీలక విషయాన్ని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు రైతుల రుణాల వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. పూర్తి సమాచారం సేకరించగానే రుణ మాఫీ జరుగుతుందని వెల్లడించారు.

ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తున్న సర్కార్, మరో రెండు హామీలు గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్‌ హామీలు నెరవేర్చేందుకు సిద్ధమైంది. తాజాగా రుణ మాఫీకి కూడా కసరత్తు ప్రారంభించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper