Balayya-Boyapati Combo: ప్రస్తుతం బాలయ్య బాబు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు. తొందరగా సినిమాలను చేస్తూ అంతే తొందరగా, రిలీజ్ చేస్తూ యంగ్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు.ఇక ఇప్పటికే వరుసగా మూడు హిట్లను సాధించిన బాలయ్య, ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో వచ్చే సినిమాతో నాలుగో సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే బాలయ్య బాబు క్రేజ్ అమాంతం తార స్థాయికి చేరుతుందనే చెప్పాలి. ఇక బాలయ్య, బోయపాటితో చేయబోయే సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. అందులో ‘ అఖండ ‘ సినిమా అయితే భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో బోయపాటి, బాలయ్య కాంబినేషన్ పవర్ ఏంటో మరోసారి నిరూపించారు. అలాగే ఇప్పుడు వీళ్ళ కాంబో లో రాబోయే నాలుగో సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో బాలయ్య ‘ఆర్మీ లెఫ్ట్ నెంట్ జనరల్ ‘ గా ఒక కీలక పాత్రలో మనకు కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కూడా ఇద్దరు బాలకృష్ణ లు మనకు కనిపిస్తారు. ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాల్లో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో బాలయ్య ని చూపించి ఒక సూపర్ సక్సెస్ కొట్టాలని బోయపాటి భావిస్తున్నాడు.
ఇక ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు అయితే ఉన్నాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు గా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో మరోసారి సాలిడ్ హిట్ కొట్టి నందమూరి అభిమానుల తో పాటు గా ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తారో…