Homeజాతీయ వార్తలుKashmir: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద ఛాయలు.. పహల్గాం తరహా దాడికి కుట్ర!

Kashmir: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద ఛాయలు.. పహల్గాం తరహా దాడికి కుట్ర!

Kashmir: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి తగ్గింది. ఎన్‌ఐఏ, ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టడంతో ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు, ఉగ్రవాద సానుభూతిపరులు కూడా సైలెంట్‌ అయ్యారు. అయినా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అయితే ఇటీవలే మళ్లీ ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. ఇటీవలే ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. దీంతో మళ్లీ సైన్యం అలర్ట్‌ అయింది. 20 మందికిపైగా ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లను అదుపులోకి తీసుకుంది. వీరి విచారణ కొనసాగుతుండగానే జమ్మూ […]

Kashmir: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి తగ్గింది. ఎన్‌ఐఏ, ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టడంతో ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లు, ఉగ్రవాద సానుభూతిపరులు కూడా సైలెంట్‌ అయ్యారు. అయినా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అయితే ఇటీవలే మళ్లీ ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. ఇటీవలే ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. దీంతో మళ్లీ సైన్యం అలర్ట్‌ అయింది. 20 మందికిపైగా ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లను అదుపులోకి తీసుకుంది. వీరి విచారణ కొనసాగుతుండగానే జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో మరో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి భద్రతా వ్యవస్థపైన, వలస కార్మికుల భద్రతపైన ప్రశ్నలు లేవనెత్తింది. ఈ ఘటనలో దీపక్‌ అనే వ్యక్తి మరణించగా, భూపిందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన వలస కూలీలు. ఘటనాస్థలంలో అనేకమంది కార్మికులు ఉన్నప్పటికీ పహల్గాం తరహాలో ఇద్దరిపైనే దాడి చేసినట్లు తెలుసింది.

పహల్గాం తరహాలో దాడి..
పహల్గాంు ఘటనలో లక్ష్యాలను గుర్తించి, నిర్దిష్ట సమూహాన్ని ఎంపిక చేసి దాడి చేసిన విధానం ఇప్పుడు కూడా కనిపిస్తోంది. అప్పటి దాడిలో మతపరమైన గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రస్తుత దాడిలో కూడా ఇలాంటి విధానం అనుసరించినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనాస్థలంలో అనేకమంది ఉన్నా కేవలం ఇద్దరు హిందూ వలస కార్మికులపైనే దాడి జరగడం ఈ అంశానికి బలం చేకూరుస్తోంది. ఇలాంటి దాడులు కేవలం వ్యక్తులను కాకుండా సమాజంలో భయాందోళనలను పెంచుతాయి. వలస కార్మికులు సాధారణంగా నిర్మాణం, ఇటుక బట్టీలు వంటి రంగాల్లో పనిచేస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తారు. వారిపైన దాడులు జరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు తగ్గే ప్రమాదం ఉంది. దీని ప్రభావం స్థానిక నిర్మాణ కార్యకలాపాలపైనా, ఉపాధిపైనా పడుతుంది.

వలస కార్మికుల భద్రత సవాల్‌..
కశ్మీర్‌లో వలస కార్మికులపై దాడులు కొత్తవి కావు. గత కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. అయితే పహల్గాం ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లు పెరిగినప్పటికీ ఇలాంటి లక్ష్యపూరిత దాడులు కొనసాగడం ఆందోళనకరం. ఉగ్రవాదులు సాధారణ పౌరులను, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా సమాజంలో విభేదాలను సృష్టించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దాడి జరిగిన తర్వాత భద్రతా దళాలు విస్తృతమైన గాలింపు చేపట్టాయి. అయితే మరింత మెరుగైన నిఘా వ్యవస్థ, వలస కార్మికుల నివాస ప్రాంతాల్లో అదనపు రక్షణ, స్థానిక సమాజంతో సమన్వయం అవసరం.

మతపరమైన లక్ష్యం..
ఈ ఘటనలో హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. పహల్గాంలో కూడా ఇలాంటి విధానం కనిపించింది. ఇలాంటి చర్యలు కేవలం ఉగ్రవాదం కాదు.. అవి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు. కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి, పర్యాటకం, ఉపాధి అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఇలాంటి దాడులు ఆ అనుసంధానాన్ని బలహీనపరుస్తాయి. ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీలు ఇలాంటి దాడులను నిరోధించడానికి సమగ్ర వ్యూహం రూపొందించాలి. వలస కార్మికులకు ప్రత్యేక రక్షణ, వేగవంతమైన న్యాయపరమైన చర్యలు, స్థానిక ప్రజల్లో నమ్మకం పెంచే చర్యలు అవసరం.

కశ్మీర్‌లో శాంతి సాధించడం సులభం కాదు. కానీ ఇలాంటి లక్ష్యపూరిత దాడులను సహించకుండా, సమర్థవంతమైన చర్యలతో ఎదుర్కోవడం మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper