Homeఎంటర్టైన్మెంట్Christopher Nolan vs Rajamouli: క్రిస్టోఫర్ నోలన్ కి రాజమౌళి కి మధ్య ఉన్న తేడా...

Christopher Nolan vs Rajamouli: క్రిస్టోఫర్ నోలన్ కి రాజమౌళి కి మధ్య ఉన్న తేడా అదే…

Christopher Nolan vs Rajamouli: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ చేసిన ప్రతి సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా పాన్ ఇండియాలో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ గా వచ్చిన ‘ది ఒడిస్సీ’ సినిమా సైతం మంచి విజయాన్ని సాధించడంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి […]

Christopher Nolan vs Rajamouli: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ చేసిన ప్రతి సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా పాన్ ఇండియాలో కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ గా వచ్చిన ‘ది ఒడిస్సీ’ సినిమా సైతం మంచి విజయాన్ని సాధించడంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. ప్రస్తుతం వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రాజమౌళి సైతం డిఫరెంట్ సినిమాలను చేసుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ చేస్తున్న సినిమాలతో పాటు రాజమౌళి చేసే సినిమాలు కూడా పోటీ పడుతున్నాయా? అనేలా రాజమౌళి తన సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. నిజానికి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ విజువల్ వండర్స్ గానే ఉంటాయి.

ఇక తను నోలన్ స్థాయికి వెళ్లాలి అంటే ఆయన ఇంకాస్త కసరత్తులు చేయాలని చాలామంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా క్రిస్టోఫర్ నోలన్ కి రాజమౌళి కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే నోలన్ తన సినిమాలో గ్రాఫిక్స్ కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు. అన్నీ లైవ్ లొకేషన్ లోనే చేస్తుంటాడు. దానివల్ల సినిమా ఒరిజినాలిటి మిస్ అవ్వదని ప్రతిదీ పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద సెట్ అవుతుందని అతను భావిస్తాడు.

గ్రాఫిక్స్ చేయడం వల్ల ఆ సీన్ లో ఉన్న నాచురాలిటీ పోతుందని దానికి ప్రేక్షకుడి పూర్తిస్థాయిలో కనెక్ట్ అవ్వలేడని, ఏదైనా నాచురల్ గా ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాలను అలా తెరకెక్కిస్తుంటాడు. రాజమౌళి మాత్రం ప్రతిది గ్రాఫిక్స్ లోనే చేయాలనుకుంటాడు. మొత్తానికి సినిమాను విజువల్ వండర్స్ గా తీర్చిదిద్దాలని చూస్తుంటాడు. దీనివల్ల మని ఎక్కువగా అవుతుంది. అలాగే టైమ్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది.

నోలన్ ప్రస్తుతం 2 సంవత్సరాలకు ఒక్క సినిమా చొప్పున రిలీజ్ చేస్తుంటే, రాజమౌళి మాత్రం నాలుగైదు సంవత్సరాలకు ఒక సినిమాని చేస్తుండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఇక ఏదేమైనా కూడా వారణాసి సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాబోయే సినిమాల్లో రాజమౌళి సైతం నోలన్ మాదిరిగానే లైవ్ లోకేషన్స్ లో షూట్ చేసుకుంటే మంచిదని మరికొంతమంది భావిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper