Shahzad Bhatti: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత దేశంలో ఉగ్రవాదుల కదలికలు తగ్గుముఖం పట్టాయి, అనేక ఉగ్ర కుట్రలను మన సైన్యం, పోలీసులు, ఎన్‌ఐఏ భగ్నం చేసింది. భారత్‌లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేసేవారిని పట్టుకున్నాయి. అయితే తాజాగా జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. ఓ కానిస్టేబుల్‌ను, ఇద్దరు కూలీలపై కాల్పులు జరిపారు. కానిస్టేబుల్, ఓ కూలీ మరణించారు. ఈ క్రమంలో భద్రతా దళాలు కశ్మీర్‌లో కఠిన చర్యలు చేపట్టారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను పట్టుకున్నాయి. అయితే దీనిపై పాకిస్తానీ ఉగ్రవాది షహజాద్ భట్టీ ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఉగ్రవాద నెట్‌వర్క్‌ల శక్తిని చూపించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.
అరెస్టులను కొట్టిపారేసి..
భారత్ అరెస్టు చేసిన 200 మంది తన నెట్‌వర్క్‌కు చెందినవారు కాదని భట్టి స్పష్టం చేశారు. అరెస్ట్ అయినవారు సీజేపీ సభ్యులని పేర్కొన్నాడు. దమ్ముంటే వారి ముఖాలను ప్రజలకు చూపించాలని సవాలు విసిరాడు. ఇది అరెస్టుల విశ్వసనీయతను ప్రశ్నించే ప్రయత్నం. అదే సమయంలో తన సంస్థ బలాన్ని నొక్కి చెప్పేందుకు కీలక ప్రకటన చేశాడు.
3000 మంది స్వేచ్ఛగా భారత్‌లో..
తన టీంకు చెందిన వారు 300 మంది భారత్‌లో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పాడు. ఇది ఉగ్రవాద బెదిరింపును పెంచే రకమైన ప్రకటన. ఇటువంటి సంఖ్యలు నిజమైతే భారత్‌లో భద్రతా సవాళ్లు ఎంత లోతైనవో సూచిస్తాయి. లేకపోతే కూడా ఇది ప్రచార ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యగా భావించవచ్చు.
సీజేపీ సభ్యులకు మద్దతు..
సీజేపీ సభ్యులు అడిగితే చట్టపరమైన, ఆర్థిక సహాయం అందిస్తానని భట్టీ చెప్పాడు. ఇది వివిధ సంస్థల మధ్య సంబంధాలు లేదా సహకారం ఉన్నట్లు సూచించే మాట. ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకునే విధానాన్ని ఇది గుర్తు చేస్తుంది.
భయం రేకెత్తించేందుకే..
ఇటువంటి వ్యాఖ్యలు ఉగ్రవాదులు తమ ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం. భారత్‌లో అరెస్టులు జరుగుతున్నప్పటికీ, ఇంకా అనేక మంది చురుకుగా ఉన్నారని చెప్పడం ద్వారా భయాన్ని రేకెత్తించాలని చూస్తున్నారు. భద్రతా ఏజెన్సీలు ఇటువంటి ప్రకటనలను తీవ్రంగా పరిగణించి, నిఘా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇవి కేవలం ప్రచారం మాత్రమే కావచ్చని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
మొత్తంగా షహజాద్ భట్టీ వ్యాఖ్యలు భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న ఉగ్రవాద సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఇటువంటి బెదిరింపులను ఎదుర్కొనేందుకు నిరంతర అప్రమత్తత, సమన్వయం అవసరం.
Pakistani ISI-backed terrorist Shehzad Bhatti, whose terror network has been dismantled in India, extends full SUPPORT to Cockroach JP and can be seen openly appealing to the CJP to “REVOLT” against Home Minister Amit Shah.
Is Bhatti sending open invitation to Unknown Men?…
— Megh Updates ™ (@MeghUpdates) August 20, 2026