spot_img
Homeఆంధ్రప్రదేశ్‌KA Paul : లవర్స్ ఓట్లన్నీ మనకే.. కె ఏ పాల్ వాలెంటైన్స్ డే ఆఫర్

KA Paul : లవర్స్ ఓట్లన్నీ మనకే.. కె ఏ పాల్ వాలెంటైన్స్ డే ఆఫర్

KA Paul : ఈరోజు వాలెంటైన్స్ డే.. ప్రేమికులు సెలబ్రేషన్ చేసుకునే డే. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. ప్రేమికుల కోసం పలు సంస్థలు ఈరోజు అనేక ఆఫర్లు ప్రకటించాయి. దర్జాగా క్యాష్ చేసుకున్నాయి.. కానీ ప్రేమికుల దినోత్సవం రాజకీయ నాయకులకు కూడా ఓట్లను దక్కేలా చేస్తుందని.. కాదేది కవితకు అనర్హం అన్నట్టు.. ప్రేమికుల దినోత్సవం కూడా ఎన్నికల ప్రచారానికి అనర్హం కాదని ఓ రాజకీయ నాయకుడు నిరూపించారు. అంతే కాదు ప్రేమికులకు రకరకాల తాయిలాలు ప్రకటించారు. ఇంతకీ ఎవరా రాజకీయ నాయకుడు? ప్రేమికుల రోజు ప్రేమికులకు ఎటువంటి ఆఫర్లు ఇచ్చాడు?

కేఏ పాల్.. పేరు చదువుతుంటేనే నవ్వొస్తుంది కదా.. రాజకీయ నాయకులందరూ సీరియస్ గా రాజకీయాలు చేస్తూ ఉంటే.. ఈయన సీరియస్ గా కామెడీ పండిస్తారు. ఆది నేనే.. అంతం నేనే.. అంతర్యామి నేనే అన్నట్టుగా మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ వరకు అందరూ తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. తనకు అధికారం ఇస్తే ఏం చేస్తానో చెబుతారు. తన పార్టీకి సింబల్ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ ను తన పార్టీలో చేరాలని డిమాండ్ చేస్తారు. చంద్రబాబు నాయుడిని ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని కోరతారు. అవసరమైతే తనను ప్రధానిని చేయాలని ఆర్డర్ వేస్తారు. అలాంటి కేఏ పాల్ తెలంగాణలో ఇలాంటి విన్యాసాలు చాలానే చేశారు.

ఇప్పుడు ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేఏ పాల్ ఆ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటించిన చోటల్లా విలేకరుల సమావేశం పెడుతున్నారు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా రోజులు కాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. మంగళవారం వాలెంటైన్స్ డే ను పురస్కరించుకొని ప్రేమికులకు తన పార్టీ తరఫున పలు హామీలు ఇచ్చారు. “కుల మతాలకు అతీతంగా ప్రేమించుకోండి. పెళ్లి చేసుకోండి. తల్లిదండ్రులను సన్మానించండి.. తన పార్టీకి ఓటు వేయండి” అంటూ పాల్ కోరారు. ప్రేమికుల కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాయితీపై రుణాలు, గృహ నిర్మాణం, ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు నర్సీపట్నంలో తన లవ్ స్టోరీ గురించి కూడా చెప్పారు. కాగా, పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాక పాల్ తమకు ఇచ్చిన హామీల పట్ల ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో కి వచ్చినా, రాకపోయినా పాల్ తమ బాధలు అర్థం చేసుకున్నారని.. ఆయనకే మేము ఓటు వేస్తామని ప్రేమికులు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Oktelugu Epaper