Homeజాతీయ వార్తలుKA Paul: ఆర్ఎస్ఎస్ చీఫ్ అమెరికా వీసా క్యాన్సల్.. రంగంలోకి కేఏ పాల్.. వెలుగులోకి కీలక...

KA Paul: ఆర్ఎస్ఎస్ చీఫ్ అమెరికా వీసా క్యాన్సల్.. రంగంలోకి కేఏ పాల్.. వెలుగులోకి కీలక వీడియో..

KA Paul:  కిలారి ఆనంద పాల్.. అలియాస్ కేఏ పాల్ .. ఈ పేరు తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేఏ పాల్ ఇప్పుడు అంటే జోకర్ అయ్యాడు కానీ.. ఒకప్పుడు ఆయన ప్రసంగిస్తుంటే వేలాది మంది వచ్చేవారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండేవారు. సువార్త స్వస్థత మహాసభలను.. శాంతి మహాసభలను ఆయన నిర్వహిస్తుంటే ప్రపంచ దేశాల అధినేతలు వచ్చేవారు. అప్పట్లో అమెరికా అధ్యక్షులు కూడా ఆయన ప్రసంగిస్తుంటే వినడానికి ఆసక్తిని చూపించే […]

KA Paul:  కిలారి ఆనంద పాల్.. అలియాస్ కేఏ పాల్ .. ఈ పేరు తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేఏ పాల్ ఇప్పుడు అంటే జోకర్ అయ్యాడు కానీ.. ఒకప్పుడు ఆయన ప్రసంగిస్తుంటే వేలాది మంది వచ్చేవారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండేవారు. సువార్త స్వస్థత మహాసభలను.. శాంతి మహాసభలను ఆయన నిర్వహిస్తుంటే ప్రపంచ దేశాల అధినేతలు వచ్చేవారు. అప్పట్లో అమెరికా అధ్యక్షులు కూడా ఆయన ప్రసంగిస్తుంటే వినడానికి ఆసక్తిని చూపించే వారంటే మామూలు విషయం కాదు.

పాల్ ప్రభ వెలిగినప్పుడు ఆయన స్థాయి ఒక రేంజ్ లో ఉండేది. ఒక దశలో ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది ఎదురు చూసేవారు. అటువంటి వ్యక్తి కొన్ని కుట్రల వల్ల తన స్థాయిని కోల్పోయారు. చివరికి ఒక జోకర్ లాగా మిగిలిపోయారు. తెలుగు మీడియా అయితే కేఏ పాల్ ను దారుణంగా చూపించడం మొదలుపెట్టింది. కేఏ పాల్ కు విషయ పరిజ్ఞానం బాగుంటుంది. కాకపోతే దాన్ని బయట పెట్టే విషయంలోనే ఆయన ఇబ్బంది పడుతుంటారు. సరిగా ఇదే విషయాన్ని తెలుగు మీడియా విపరీతంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అందులో ఉన్న పాజిటివిటీని పక్కనపెట్టి.. నెగిటివిటీ ని మాత్రమే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అందువల్లే కేఏ పాల్ అభాసు పాలవుతుంటారు.

ఇక కేఏ పాల్ అమెరికాలో ఉన్నారు. ఆయన ఒక సెల్ఫీ వీడియో ద్వారా కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. సరిగా కొద్ది గంటల క్రితమే ఆయన అమెరికా వెళ్లారు.. ఆయన అమెరికాకు రావడానికి అంటే ముందే క్రిస్టియన్ సంస్థలు.. ముస్లింలు.. సిక్కులు అమెరికా ప్రభుత్వానికి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫిర్యాదు చేశారు. మోహన్ భగవత్ వీసా క్యాన్సల్ చేయాలని కోరారు. దీనికంటే ముందే కేఏ పాల్ కు ఒక వ్యక్తి ఫోన్ చేశారు. ఆయన అభిప్రాయం అడిగారు. చివరికి న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దాని మోహన్ భగవత్ వీసా క్యాన్సల్ చేయాలని అమెరికా అధ్యక్షుడిని కోరినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో కేఏ పాల్ ఒక సంచలన సెల్ఫీ వీడియో ద్వారా కీలక విషయాలను బయటపెట్టారు. “డెమొక్రటిక్ కంట్రీలో మోహన్ భగవత్ టూర్ క్యాన్సల్ చేయడం సరికాదు. ఆయన టూర్ క్యాన్సల్ చేస్తే ఇతర మతాలకు సంబంధించిన వారికి కూడా క్యాన్సల్ చేయాల్సి ఉంటుంది. డెమొక్రటిక్ కంట్రీలో అందరికీ ఒకే విధమైన లా ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను నేను ఒకటి అడగదలచుకున్నాను. ఆగస్టు 29న మీ సందేశంలో క్రైస్తవులకు.. ముస్లింలకు.. సిక్కులకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. మా దేశంలో డెమొక్రటిక్ వ్యవస్థ కొనసాగుతోంది. మరి ఇప్పుడు తరహాలో ఎటువంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వబోము. అందరిని ఆదుకుంటామని చెప్పాలని” కేఏ పాల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. పాల్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ కు అతడు అండగా నిలిచిన విధానం పట్ల బిజెపి నాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కేఏ పాల్ జోకర్ కాదని.. సీరియస్ పొలిటిషన్ అని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper