spot_img
Homeఅంతర్జాతీయంJimmy Carter: అమెరికా అధ్యక్షుడు జిమ్మీకి.. ఇండియాలోని ఓ గ్రామానికి అసలు సంబంధం ఏంటి?

Jimmy Carter: అమెరికా అధ్యక్షుడు జిమ్మీకి.. ఇండియాలోని ఓ గ్రామానికి అసలు సంబంధం ఏంటి?

Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్ను మూసిన విషయం తెలిసిందే. జిమ్మీ కార్టర్ 39వ అధ్యక్షుడిగా అగ్ర రాజ్యానికి సేవలు అందించారు. ఒక సైనికుడిగా కూడా సేవలు అందించి.. ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పల్లీల వ్యాపారం చేశారు. అలా రాజకీయాల వైపు మళ్లారు. అయితే జిమ్మీ అమెరికా అధ్యక్షుడు.. కానీ ఇతని పేరు మీద దేశంలో ఓ గ్రామం ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడు అయిన జిమ్మీకి, ఆ గ్రామానికి సంబంధం ఏంటనే విషయాలు ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ హయాంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ తన భార్య రోసలిన్ కార్టర్‌తో కలిసి 1978లో భారత్‌లో పర్యటించారు. ఈ క్రమంలో హర్యానాలోని దౌలత్‌పూర్ నసీరాబాద్‌కి వెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఆ గ్రామానికి కార్టర్‌ పురి అని పేరు పెట్టారు. అయితే కేవలం ఈ ఒక్క కారణం వల్ల ఆ గ్రామానికి జిమ్మి కార్టర్ పేరు పెట్టలేదు. 1960 సంవత్సరంలో జిమ్మీ తల్లి ఆ గ్రామంలో ఆరోగ్య వాలంటీర్‌గా పనిచేశారు. ఈ కారణం వల్ల కూడా ఆ గ్రామానికి కార్టర్ పురి అని పెట్టారట. జిమ్మీ ఈ గ్రామంలో 1978 జనవరి 3న పర్యటించడంతో అప్పటి నుంచి కార్టర్‌పురిలో సెలవు దినంగా ప్రకటించారు. కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అప్పుడు గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

దాదాపుగా వందేళ్లు జీవించిన జిమ్మీ కార్టర్ ఆదివారం రాత్రి మరణించారు. ఎక్కువ కాలం జీవించి ఉన్న అమెరికా అధ్యక్షుడిగా జిమ్మీ రికార్డు సృష్టించారు. ఒక అమెరికా అధ్యక్షుడుగా, పల్లీ వ్యాపారవేత్తగా, సైనికుడిగా కంటే గొప్ప విలువలు ఉన్న వ్యక్తిగా జిమ్మీకి గౌరవం ఉంది. 1924న అక్టోబర్ 1 జన్మించిన జిమ్మీ కార్టర్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నతమైన సేవలు చేశారు. 1977 నుంచి 1981 వరకు జిమ్మీ అమెరికా అధ్యక్షుడిగా పాలించారు. డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడిగా అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్‌పై జిమ్మీ గెలిచి, యూఎస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే జిమ్మీ భార్య రోసలెన్ 96 ఏళ్ల వయస్సులో గతేడాది మరణించారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper