spot_img
Homeఆంధ్రప్రదేశ్‌రాంకీ సంస్థలపై ఐటీ దాడులు: వైసీపీలో కలకలం

రాంకీ సంస్థలపై ఐటీ దాడులు: వైసీపీలో కలకలం

IT raids on Ramkyరాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ కావడమే కాకుండా అక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో దాదాపు 20 బృందాలతో సోదాలు సాగిస్తున్నారు. రాంకీ గ్రూపు సంస్థల కార్యాలయాలతోపాటు హైదరాబాద్ లో ఉన్న ఆయన ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.

రాంకీ గ్రూప్ ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తోంది. వేస్ట్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. గచ్చిబౌలిలో రాంకీ సంస్థప్రధాన కార్యాలయం ఉంది. అక్కడ కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కంపెనీ జరిపిన కొనుగోలు, అమ్మకాల్లో తేడాలున్నట్లు గుర్తించారు. పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్ లు తయారు చేశారని తెలుస్తోంది.

వైసీపీ వ్యూహకర్తల్లో ఒకరైన అయోధ్య రామిరెడ్డికి ఐటీ గురి పెట్టడంతో చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ పెద్దల లావాదేవీల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారనే పేరుంది. సోదాల్లో మరో కీలకమైన అంశం ఉందని చెబుతున్నారు. ఇటీవల రాంకీ షేర్స్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో సెబీ విచారణ చేయాలని ఐటీ డిపార్ట్ మెంట్ ను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. షేర్ల ధరలు పెరగడం వెనుక ఉన్న స్కాంను ఐటీ వెలికి తీసేందుకే ఈ దాడులు చేసినట్లు చెబుతున్నారు.

అయితే ఐటీ దాడులు జరిపిన సోదాల్లో ఏదైనాలింకులు దొరికితే అవి ఇతర ప్రముఖులకు చుట్టుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో8 కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న వైసీపీ తమపార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడకుండా జాగ్రత్తలు పడుతున్నా అనూహ్యంగా ఇలాంటి దాడులు జరగడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

SIM Card Cut Corner

SIM Card Cut Corner: సిమ్ కార్డుకు ఒకవైపు కట్ చేసి ఉంటుంది.. ఎందుకో తెలుసా..

SIM Card Cut Corner: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ ఫోన్లో సిమ్ లేకపోతే ఎలాంటి పనులు చేయరాదు....
Divi Bigg Boss Host

Bigg Boss Host: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా టీం ఇండియా కెప్టెన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు...

Bigg Boss Host: దేశవ్యాప్తంగా వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో 'బిగ్ బ్రదర్' అనే పేరుతో...
Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
Oktelugu Epaper