కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని నాగ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించి మొత్తానికి అందరికి షాక్ ఇచ్చాడు. మేకప్ లేకుండా నాగార్జున ఇలా ఉంటాడా ? అంటూ నెటిజన్లు కూడా షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ యాక్షన్ డ్రామా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మాణం జరుగుతుంది. జులై 18 నుండి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటిలోగా ఇప్పుడు వేస్తోన్న సెట్ ను పూర్తి చేయాలని ప్రవీణ్ సత్తారు ఆర్ట్ డైరెక్టర్ కి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. అన్నట్టు ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయింది.
కానీ మొదటి షెడ్యూల్ లో ఇంకా కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అందుకే లాస్ట్ షెడ్యూల్ లోని సీన్స్ ను ముందుగా షూట్ చేసి, ఆ తరువాత కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మొత్తానికి నాగార్జున ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తీ కాగానే నాగ్ “బంగార్రాజు” సినిమాని స్టార్ట్ చేస్తాడట. ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం అయితే బంగార్రాజు సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుండి స్టార్ట్ చేస్తారట. అయితే ఈ సినిమా నుండి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు అనుకోండి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nagarjuna shocking look
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com