spot_img
Homeజాతీయ వార్తలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కీలక ట్విస్ట్ ఇదే!

 జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కీలక ట్విస్ట్ ఇదే!

మరో రెండు మూడు నెలల్లో గ్రేటర్ ఎన్నికలకు ముహూర్తం రెడీ కాబోతోంది. ఇప్పటికే పార్టీలు తమ ప్రచారంతో వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా కరోనా తొలగిపోలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా ప్రచారంపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. పోలింగ్ అధికారులతోపాటు ఓటర్లు కూడా మాస్కులు ధరించడం తప్పని సరి చేశారు. ఓటరును గుర్తించాల్సిన పరిస్థితి వస్తే మాస్కును జరిపి ముఖాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలపై తెలంగాణ రాష్ర్ట ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది.

Also Read: యాక్టివ్‌ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?

అలాగే.. ఇంటింటి ప్రచారంలోనూ అభ్యర్థితో సహా ఐదుగురికే పర్మిషన్‌ ఉంటుందని వెల్లడించింది. రోడ్ షోలకు ఐదు వాహనాలు మాత్రమే అనుమతించనున్నారు. సభలు, సమావేశాల నిర్వాహణలోనూ కరోనా కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను మరికొన్ని వర్గాలకు విస్తరించారు. రక్షణ రంగంలో పనిచేసే వారు, ఎన్నికల విధులకు హాజరయ్యే వారు, అధికారిక విధుల నిర్వహణలో భాగంగా దూరంగా ఉన్న.. విదేశాల్లో ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుందని తెలిపారు. దివ్యాంగులకు, 80 ఏళ్లు పైబడిన ఓటర్లతో పాటు అత్యవసర సేవల విధుల్లో పాల్గొంటున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వారి సంఖ్య భారీగా పెరగనుంది.

ఈసారి పోలింగ్‌ కేంద్రాల విషయంలోనూ పద్ధతి మార్చనున్నారు. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించేలా విశాలంగా ఉన్న బిల్డింగ్‌లను ఎంపిక చేయనున్నారు.పోలింగ్ కేంద్రం, ఆ పరిసరాల్లో శానిటైజర్‌‌ను అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రాలు శానిటైజ్ చేయాలని, పురుషులు, మహిళా ఓటర్లకు వేర్వేరు క్యూ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడో ప్రత్యేక లైన్ ఏర్పాటుతో పాటుపోలింగ్ కేంద్రాల దగ్గర మార్కింగ్ చేయాలని సూచించారు.

Also Read: అప్పుడే 6 కోట్ల ఓట్లు.. అమెరికా ఓటర్ల తీర్పు ఎటువైపు?

అభ్యర్థులు నామినేషన్‌ను కూడా ఈ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో వేయనున్నారు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో పూర్తిచేసి ఆ ప్రింట్‌ కాపీని రిటర్నింగ్‌ ఆఫీసర్‌‌కు సమర్పించాల్సి ఉంటుంది. అఫిడవిట్, విద్యార్హతలు, నేరచరిత్ర ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తి చేస ప్రింట్ కాపీ అందించవచ్చని తెలిపింది. రోజు వారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలుకు అభ్యర్థి, మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయ ఆవరణ దగ్గరకు రెండు వాహనాలనే అనుమతించనున్నారు. కరోనా కట్టడి చర్యలు, ఏర్పాట్ల పర్యవేక్షణకు జీహెచ్ఎంసీ, సర్కిల్, వార్డు స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper