spot_img
Homeజాతీయ వార్తలుయాక్టివ్‌ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?

యాక్టివ్‌ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?

Konda couple into active role
కొండా కపూల్స్‌ ఒకప్పుడు ఉమ్మడి స్టేట్‌లో రాజకీయాల్లో వెలుగు వెలిగిన లీడర్స్‌. ఓరుగల్లు కోట సాక్షిగా తిరుగులేని రాజకీయ నేతలుగా ముద్రపడిన వారు. మంత్రి హోదాలను అనుభవించిన వారు. కానీ.. టైం బ్యాడ్‌. ఏ స్థాయిలో వెలుగు వెలిగారో ఇప్పుడు వారి రాజకీయ జీవితం అంత చీకట్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు మళ్లీ మరో టర్న్‌ తీసుకోబుతున్నారట.

Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కీలక ట్విస్ట్ ఇదే!

కొండా సురేఖ దంపతులంటే ఇరు రాష్ట్రాల్లోనూ తెలియనివారుండరు. తూటాల్లాంటి మాటలు.. మంటల దారిని తలపించే వారి బాట యమ క్రేజ్‌. చాలా రోజులుగా సైలెంట్‌ అయిపోయిన ఈ దంపతులు మళ్లీ యాక్టివ్‌ రోల్‌లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నారట. తెలంగాణ రాజకీయాల్లో ఓరుగల్లు జిల్లాది ఓ ప్రత్యేక స్థానం. అందులో కొండా సురేఖ దంపతుల ప్రస్థానం మరింత ప్రత్యేకం. కాంగ్రెస్ పార్టీ, అందునా వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వారిది స్వర్ణ యుగం. జిల్లాలో వీరు చెప్పిందే వేదం. వీరు చేసిందే శాసనం.

వైఎస్సార్‌‌ మరణానంతరం ఆయన మీద ఉన్న అభిమానంతో ముందుగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత మారిన రాజకీయాలకు అనుగుణంగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గం మారి మరీ సత్తా చాటారు. గులాబీ పార్టీలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2018 ఎన్నికల్లో, ఫస్ట్ ఫేజ్‌లో టికెట్ ఇవ్వలేదు. సీఎం నేరుగా వీరితో చర్చించి బీఫాం ఇద్దామని భావిస్తున్న తరుణంలోనే, ఘర్‌ వాపసీ అంటూ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గులాబీ దండుపై విమర్శల జడివాన కురిపించారు. కాంగ్రెస్‌ తరపున పరకాలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నిశ్శబ్దంలో ఉన్నారు. ఇప్పుడు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించి, రీయాక్టివ్‌ అయ్యారు కొండా కపుల్స్.

Also Read: పోలవరం: టీడీపీ, వైసీపీతో కేంద్రం ఆట!

తాజాగా.. అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్‌‌ను కాంగ్రెస్‌లోకి లాగి తమ ఆధిపత్యాన్ని చాటారు. గులాబీ దళానికి సవాల్ విసిరారు. అంతేకాదు వరంగల్ తూర్పు స్థానం నుంచి, బరిలోకి దిగేది తానేనని తేల్చిచెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, బీసీ లీడర్‌ను మేయర్ చేస్తామని శపథం చేయడంతో వరంగల్‌లో రాజకీయ వేడి రగులుకుంది. కార్పొరేషన్ ఎన్నికలను కొండా దంపతులు ఎందుకింతగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్న దానిపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. గతంలో కొండా కపుల్స్‌కు అడ్డాగా ఉన్న పరకాల నియోజకవర్గాన్ని వీడి, వరంగల్ తూర్పు వైపు వారి మనసు మళ్లుతోందట. అందుకే తూర్పు నియోజకవర్గంలో సెల్ఫీలతో సందడి చేస్తున్నారట. 24 గంటలు తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారట. త్వరలో రాబోతున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ దమ్ము చూపిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 23 డివిజన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు  కొండా కపుల్. మొత్తానికి ఇన్నాళ్లు సైలెంట్‌ అయిపోయిన ఈ దంపతులు ఇప్పుడు ఒక్కసారిగా నిద్ర లేవడంతో అటు పార్టీలోనూ.. ఇటు అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper