spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP: తెలుగుదేశం అభ్యర్థుల్లో భయం

TDP: తెలుగుదేశం అభ్యర్థుల్లో భయం

TDP: ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపి దూకుడు మీద ఉంది. ఇప్పటివరకు 53 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. మరో 30 మందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదలయ్యాయి. మలి విడత జాబితా రానున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసిపి వేగంగా అడుగులు వేస్తుండగా.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్థాయిలో ప్రకటన రావడం లేదు. అభ్యర్థులు ఖరారు కావడం లేదు. జనసేనతో పొత్తులో ఉండడం ఒక కారణమైతే.. బిజెపి కలిసి వస్తుందని ఎదురుచూపు మరో కారణం.

తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది? ఇస్తే ఎక్కడిస్తుంది? జనసేన ఎన్ని స్థానాలు అడుగుతుంది? ఆ పార్టీకి బలమైన నియోజకవర్గాలు ఎన్ని? పొత్తులో భాగంగా టిడిపి వదులుకోవలసిన స్థానాలు ఎన్ని? కొత్తగా బిజెపి కూటమిలో చేరితే ఎక్కడ సర్దుబాటు చేస్తారు? నగర ప్రాంతాల్లోనా? గ్రామీణ నియోజకవర్గాలా? ఇప్పుడు ఏ ఇద్దరు టిడిపి నాయకులు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. తమ అవకాశాలకు ఎక్కడ గండి పడుతుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.

ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, విశాఖ జిల్లాలో జనసేనకు తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అయితే జనసేన సైతం ఉమ్మడి 13 జిల్లాల్లో.. ప్రతిచోట ప్రాతినిధ్యం ఉండాలని కోరుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో సింహభాగం స్థానాలు ఆశిస్తోంది. విశాఖ తో పాటు గుంటూరు,కృష్ణ జిల్లాల్లో కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాలను కోరుతోంది. దీంతో అక్కడ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు, నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఎక్కడ పొత్తులో భాగంగా తమ సీటు పోతుందన్న బెంగ వారిని వెంటాడుతోంది. మరోవైపు బిజెపి కూటమిలోకి వస్తే.. సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా నగరాల్లో బిజెపి సీట్లు ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ, విశాఖ, గుంటూరు వంటి నగరాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో తాము బలంగా ఉన్నట్లు బిజెపి చెబుతోంది. ఒకవేళ అక్కడ సీట్లను బిజెపి కోరితే మాత్రం.. చాలామంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper