Homeజాతీయ వార్తలుEl Nino Effects: ఎల్ నినో తో కరువే కాదు.. ఈ సమస్య కూడా.. ఇలా...

El Nino Effects: ఎల్ నినో తో కరువే కాదు.. ఈ సమస్య కూడా.. ఇలా అయితే మనుషులకు కష్టమే..

El Nino Effects: ఉష్ణోగ్రతలు పెరగడంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్ నినో ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లే యూరప్ నుంచి ఇండియా వరకు విపరీతంగా ఎండలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ ప్రభావం నిత్యం జరిగేదేనని.. కానీ ఈసారి అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో వల్ల వర్షాలు సరిగ్గా కురిసే అవకాశం లేదు. […]

El Nino Effects: ఉష్ణోగ్రతలు పెరగడంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్ నినో ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లే యూరప్ నుంచి ఇండియా వరకు విపరీతంగా ఎండలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ ప్రభావం నిత్యం జరిగేదేనని.. కానీ ఈసారి అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఎల్ నినో వల్ల వర్షాలు సరిగ్గా కురిసే అవకాశం లేదు. దీనివల్ల జలాశయాలలోకి నీళ్లు అంతగా రావు. నీళ్లు లేకపోవడం వల్ల పంటలు పండవు. చివరికి తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీళ్లు లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో మహారాష్ట్రలో లాతూర్ ప్రాంతంలో నీళ్ల కరువు వచ్చినప్పుడు.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లల్లో నీళ్లు సరఫరా చేసింది. నీళ్లను ప్రజలు దొంగలించకుండా ఏకంగా ఆర్మీని రంగంలోకి దింపింది. అప్పట్లో ఈ సంఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర.. ఈశాన్య రాష్ట్రాలు.. మినహా మిగతా దేశంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంటల ఉత్పత్తి ఈసారి తీవ్రంగా పడిపోతుందని.. కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుందని.. నిత్యవసరాల మీద చేసే ఖర్చు పెరుగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల పై సమస్యలు మాత్రమే కాకుండా.. నిద్రలేమి కూడా ఉంటుందని తెలుస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రాత్రిపూట ఉక్కపోత అధికంగా ఉంటుందని.. గాల్లో తేమ శాతం లేకపోవడం వల్ల ఫ్యాన్ లు.. కూలర్లు.. ఏసీలు అంతగా చల్లదనం ఇవ్వలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.. కొంతకాలంగా దక్షిణాది ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాత్రిపూట కూడా వేడి అధికంగా ఉంటున్నది. దీనివల్ల ప్రజలు ప్రతి ఏడాది 78 నుంచి 91 గంటల వరకు నిద్రను కోల్పోతున్నారు.. ఇందులో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర నష్టం కేవలం వాతావరణ మార్కుల వల్ల సంభవిస్తుంది.. తమిళనాడు రాష్ట్రంలో ఈ నష్టం అధికంగా ఉంది. ఒక్కో వ్యక్తి కి ఆ రాష్ట్రంలో ఏడాదికి 7.9 అదనపు గంటల నిద్ర నష్టం వాటితోంది.. శాస్త్రవేత్తలు చేసిన ఈ అధ్యయనానికి మనదేశంలో ఉన్న 107 నగరాలను ఎంచుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper