Homeఅంతర్జాతీయంEurope Heatwave: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ దాకా.. వామ్మో ఇలాగైతే మనుషులు బతికేది కష్టమే..

Europe Heatwave: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ దాకా.. వామ్మో ఇలాగైతే మనుషులు బతికేది కష్టమే..

Europe Heatwave: ఐరోపా ప్రాంతంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావు. అక్కడ శీతల స్థితి ఉంటుంది. మండే ఎండకాలంలో కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.. అటువంటి చోట ఇప్పుడు భరించలేని వేడి.. అమెరికాలో తట్టుకోలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు.. న్యూఢిల్లీలో కనిపించని వర్షాలు.. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం తీవ్రమైన వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇది ఎక్కడదాకా దారి తీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే మనుషులు బతికే పరిస్థితి లేదు. వర్షాలు కురవడం […]

Europe Heatwave: ఐరోపా ప్రాంతంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావు. అక్కడ శీతల స్థితి ఉంటుంది. మండే ఎండకాలంలో కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది.. అటువంటి చోట ఇప్పుడు భరించలేని వేడి.. అమెరికాలో తట్టుకోలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు.. న్యూఢిల్లీలో కనిపించని వర్షాలు.. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచం మొత్తం తీవ్రమైన వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇది ఎక్కడదాకా దారి తీస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే మనుషులు బతికే పరిస్థితి లేదు.

వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గడం లేదు. ఉక్క పోత ఊపిరి సలపనివ్వడం లేదు. ఇదేమీ ఎండకాలం కాదు. నిండు వానాకాలం.. ఇటువంటి పరిస్థితికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రం మీద ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కడం. ఈ జలాలు వేడెక్కడం వల్ల పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. వర్షాలు కురవడం లేదు. మేఘాలు ఏర్పడడం లేదు. ఒకవేళ మేఘాలు ఏర్పడినా అవి వర్షించడం లేదు.

ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది.. మనదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇలానే ఉంది. చివరికి యూరప్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు చల్లదనం కోసం సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు. రాత్రిపూట ఇంట్లో ఉండలేక సముద్ర తీర ప్రాంతాల్లోనే పడుకుంటున్నారు.

ఎల్ నీనో ప్రభావం వల్ల మనదేశంలో వాతావరణం అసాధారణంగా మారిపోయింది. జూన్ నెలలో అత్యంత లోటు వర్షపాతం నమోదయింది. జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మిల్లీమీటర్లుగా నమోదు కావాల్సి ఉండేది. అయితే ఈసారి అది కేవలం 85.2 మిల్లీమీటర్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. మనదేశంలో సుమారు 724 జిల్లాలు ఉండగా.. ఇందులో 315 జిల్లాలలో ఎల్ నీనో ప్రభావం అధికంగా ఉంది. అయితే 1905లో 87.4, 1926లో 100 ఎంఎం, 2009లో 87.5 ఎంఎం, 2014లో 95.3 ఎంఎం వర్షపాతం నమోదయింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా జిల్లాలో పంటలు సాగు చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పంటల సాగు మందకొడి గానే ఉంది. ఆరుతడి పంటలు సాగుచేసే వాతావరణం కూడా లేకపోవడంతో.. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మినహా.. మిగతా ప్రాంతాలలో వర్షపాతం దారుణంగా నమోదయింది. జూలై నెలలో అల్పపీడనాలు లేదా వాయుగుండాలు ఏర్పడితేనే వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

యూరప్, అమెరికా, వంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేక నరకం చూస్తున్నారు. అట్లాంటిక్ సముద్రంలో నుంచి వేడిగాలులు వస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమశాతం పూర్తిగా తగ్గిపోయి.. విపరీతమైన వేడి నమోదు అవుతుంది. దీనికి తోడు సూర్యుడు రెచ్చిపోయి దంచి కొడుతున్నాడు. ఆ వేడిని తట్టుకోలేక దక్షిణాఫ్రికా.. ఐరోపా.. యూరప్… వంటి ప్రాంతాలలో మరణాలు కూడా నమోదవుతున్నాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper