Homeఆంధ్రప్రదేశ్‌మందు బాబు చేతిలో బాంబు.. జనం పరుగులు.. చివరికి

మందు బాబు చేతిలో బాంబు.. జనం పరుగులు.. చివరికి

Drunken man threatens villagers with bombsగొంతులో మందు పడితే చాలు స్వర్గం కనిపిస్తుంది. చుక్క పడితే కానీ డొక్కాడని వారుంటారు. పెగ్గు పడితే కాని పనిలో దిగరు. మందు తాగితే చాలు మహారాజులమని బుకాయిస్తారు. అందరిని పిచ్చోళ్లలా చూస్తారు. ఎవరు అడ్డు వచ్చినా తోసేస్తారు. తమకు తామే హీరోలా భావించుకుని నానా హంగామా చేస్తారు. ఎవరైనా వారిస్తే వారినే గెంటేస్తారు. మత్తు దిగేదాకా వారికిష్టమైనదే చేస్తారు. మత్తు వదిలాక ఇక ఎవరి మొహం చూడకుండా చాటేస్తారు. అంతటి శక్తి మద్యానికి ఉంటుంది. అలాంటి మద్యంలో ఉన్న వ్యక్తి సృష్టించిన హంగామా చూస్తే మనకు ఇట్లే తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా చంద్రగరి నియోజకవర్గంలోని పాకాల మండలం వాల్లివేడు గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కృష్ణయ్య విచ్చలవిడిగా మద్యం తాగుతాడు. తనకు అడ్డు వచ్చిన వారిని నానా బూతులు తిడుతూ నిత్యం గొడవలు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో ఫుల్ గా తాగి హల్ చల్ చేశాడు. చేతిలో నాటు బాంబుల సంచి పట్టుకుని గ్రామంలో అందరిని బెదరగొట్టాడు. కిక్ సినిమాలో హీరోలా కిక్ కోసం ఊరంతా ఉరికించాడు. దీంతో ఊరంతా పరుగులు పెట్టారు.

సోమవారం రాత్రి కృష్ణయ్య అతిగా మద్యం తాగాడు. ఓ చేతిలో మందు బాటిల్ మరో చేతిలో ఓ సంచి తీసుకుని గట్టిగా అరుస్తూ వీధుల్లో పరుగెత్తాడు. బయటకు రాకుంటే బాంబులు వేస్తానని బెదిరించాడు. దీంతో అందరు పరుగులు పెట్టారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. చేతిలో బాంబు పట్టుకుని పరుగు పెట్టాడు. చివరికి ఆ బాంబును ఓ ఖాళీ ప్రదేశంలో విసరగా అది పేలింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా కృష్ణయ్య పారిపోయాడు.

గ్రామంలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? దేని కోసం తీసుకొచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వన్య ప్రాణులను వేటాడేందుకు తీసుకొచ్చి ఉంటారా? అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కృష్ణయ్య పట్టుబడితే తప్ప ఈ కేసులో నిజాలు తెలిసేలా లేవు. బాంబుల వెనకున్న మిస్టరీ వీడడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రశాంత మైన ఊరిలోకి బాంబుల మోత ఎందుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper