Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పాలాభిషేకం కోసం తెచ్చిన పాలు విరిగిపోవడంతో కలకలం రేగింది. భక్తురాలు సమర్పించిన 10 లీటర్ల పాటు పనికిరావని గుర్తించి, ఈవో పెంచల కిషోల్ వాటిని పారబోయించారు. పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకున్నారు. మరోసారి తప్పు జరగదు అన్నారు. తిరుమల తరహాలో ఉచిత సేవలు ప్రారంబించాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ నిర్ణయించారు.
స్వామివారికి విరిగిన పాలతో అభిషేకం
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో అపచారం
నిన్న సాయంత్రం క్షీరాభిషేకంలో పాడైపోయి, విరిగిన పాలతో అభిషేకం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీసిన భక్తులు pic.twitter.com/q31V2FfoFN
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025