Chirutha hulchul in Kosigi: ఈ భూమి మీద ఎన్ని ప్రమాదకరమైన జంతువులు ఉన్నప్పటికీ.. అవి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ.. పులి మాత్రమే అడవిని వణికించగలదు.. ఎంతటి పెద్ద జంతువు నైనా సరే చంపేయగలదు. చీల్చి చీల్చి తినేయగలదు. అందుకే అంతటి ఏనుగు సైతం ఒక్కోసారి పులికి భయపడుతుంది. అడవికి రాజు లాంటి సింహం కూడా కొన్ని సందర్భాల్లో వెనుకడుగు వేస్తుంది. ఇక పులుల్లో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ.. అవన్నీ అత్యంత ప్రమాదకరమైనవే. వేగంగా వేటాడుతాయి. అత్యంత వేగంతో పరుగులు పెడుతుంటాయి. ప్రత్యర్థి జంతువుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చంపి తినేస్తుంటాయి. మామూలుగా అయితే పులులను పెద్దపెద్ద జంతు శాస్త్ర నిపుణులు కూడా దూరంగా చూసేందుకు మాత్రమే ఇష్టపడుతుంటారు. దగ్గరగా వెళ్లడానికి భయపడుతుంటారు. ఇక జూ కీపర్ లు కూడా అలానే వ్యవహరిస్తుంటారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం పులిని వీరు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంధించారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కారణాలు జిల్లా కోసిగి ప్రాంతంలో.. పంట చేలలో చిరుత పులి సంచరిస్తోంది. దీంతో అటువైపుగా వెళ్లడానికి స్థానిక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు.. అక్కడక్కడ ఎరలు ఏర్పాటు చేశారు. అయితే పంట పొలాలకు వెళ్లే రైతులు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా.. ఏకంగా పులిని బంధించాలి అనుకున్నారు. పులిని పట్టుకుని.. అధికారులకు అప్పగించాలని భావించారు. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా మాటువేశారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఓ పంట పొలంలో పులి నక్కి ఉండగా.. వెంటనే అక్కడి రైతులు తమ వెంట తెచ్చుకున్న వలను అత్యంత ఒడుపుగా పట్టుకొని పులి దగ్గరికి వెళ్లారు. అమాంతం పులి మీద ఆ వల వేశారు. అంతేకాదు పులికి ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వకుండా అందులో దానినిబంధించారు. చాలామంది వ్యక్తులు ఆ వలను అలానే పట్టుకొని అత్యంత జాగ్రత్తగా దానిని చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆ వలను గట్టిగా కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పులిని పట్టుకున్న తర్వాత ఆ రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ పులిని తమ వెంట తీసుకెళ్లిపోయారు.
” మీరు మామూలు వాళ్లు కాదు. ఏకంగా వలతో పులిని బంధించారు. దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అదుపులో పెట్టుకున్నారు. అది దాడి చేస్తుందని భయం లేదు. చంపేస్తుందనే వణుకు లేదు. అసలు మీ ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ వీడియో చూస్తుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. ఎంతైనా మీరు తోపులు భయ్యా.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. మీ గుండెస్థైర్యానికి సలాం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కోసిగిలో చిరుత పులిని ఎలా పట్టారో చూడండి..?#Kosigi #tiger #attack‘ #kurnoolvedio #Aptoday #ట్రెండింగ్ pic.twitter.com/r83iGUoMKT
— Bhaskar Reddy (@chicagobachi) June 15, 2025