Homeఅంతర్జాతీయంGiorgia Meloni: అందరి ముందే ఇజ్రాయెల్‌ ప్రధానికి షాకిచ్చిన జార్జియో మెలోనీ.. వైరల్‌ వీడియో

Giorgia Meloni: అందరి ముందే ఇజ్రాయెల్‌ ప్రధానికి షాకిచ్చిన జార్జియో మెలోనీ.. వైరల్‌ వీడియో

Giorgia Meloni: పశ్చిమాసియా దేశం ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి తీవ్రంగా దాడులు చేశాయి. అంతకుముందు ఇజ్రాయెల్‌ హమాస్‌ లక్ష్యంగా పాలస్తీనాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. హమాస్‌ ప్రాక్సీ గ్రూపులు ఉన్న దేశాలనూ వదలలేదు. పిల్లలు, పెద్దలు, వృద్దులు ఉగ్రవాదులు అని చూడకుండా హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా విధ్వంసం సృష్టించింది. దీనిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక ఇరాన్‌పైనా తాజాగా విరుచుకుపడుతోంది. పాలస్తీనాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా, పాకిస్తాన్, భారత్‌ వంటి దేశాల్లోనూ […]

Giorgia Meloni: పశ్చిమాసియా దేశం ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి తీవ్రంగా దాడులు చేశాయి. అంతకుముందు ఇజ్రాయెల్‌ హమాస్‌ లక్ష్యంగా పాలస్తీనాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. హమాస్‌ ప్రాక్సీ గ్రూపులు ఉన్న దేశాలనూ వదలలేదు. పిల్లలు, పెద్దలు, వృద్దులు ఉగ్రవాదులు అని చూడకుండా హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా విధ్వంసం సృష్టించింది. దీనిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక ఇరాన్‌పైనా తాజాగా విరుచుకుపడుతోంది. పాలస్తీనాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా, పాకిస్తాన్, భారత్‌ వంటి దేశాల్లోనూ నిరసనలు జరిగాయి. తాజాగా ఒక దేశ ప్రధానే స్వయంగా ఇజ్రాయెల్‌ తీరును తప్పుపడుతూ ప్రపంచ నేతల ఎదుట నిరసన తెలిపింది.

ఇటలీ ప్రధాని పాలస్తీనా జెండతో..
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇటీవల ప్రపంచ దేశాల సదస్సులో ఇజ్రాయెల్‌ ప్రధానికి షాక్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐక్యరాజ్య సమితిలో ఈ సమావేశం జరిగినట్లు వీడియో ఆధారంగా తెలుస్తోంది. ఇందులో జార్జియా మెలోనో పాలస్తీనా జెండాను వీపుపై వేసుకుని.. దేశాధినేతలందరూ రెండువైపులా నిలబడి ఉండగా, మధ్యలో నుంచి వచ్చిన మెలోనీ, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ వైపు కోపంగా చూస్తూ.. నడుచుకుంటూ వెళ్లిపోయారు. మెలోనీని చూసిన నెతన్యాహూ.. తల కిందకు వంచుకుని ఉండడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు నేతు మహిళను, తల్లిని అమాయకులను చంపినవారికి అండగా నిలవను అనే క్యాప్షన్‌తో దీనిని పోస్టు చేశారు.

నెటిజన్ల స్పందన..
మెలోనీ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ట్రంప్, నెతన్యాహ్యూ, అమెరికా, ఇజ్రాయెల్‌పై ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు. అమాయకులను చంపేశారని, నర హంతకులు అని కామెంట్‌ చేస్తున్నారు. ధటీజ్‌ మెలోనీ అని కామెంట్‌ చేస్తున్నారు. ఇక కొందరు ఈవీడియో ఫేక్‌ అని కూడా కామెంట్‌ చేస్తున్నారు. దీనిని ఏఐతో క్రియేట్‌ చేశారని పేర్కొంటున్నారు. 2026లో మెలోనీ, నెతన్యాహు ఎక్కడా కలవలేదని పేర్కొంటున్నారు. ఈ వీడియోలో ఉన్న సమావేశం 2023లో రోమ్‌లో జరిగిందని పేర్కొంటున్నారు.

జార్జియా మెలోనీ సాధారణంగా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే నాయకురాలు. హమాస్‌పై ఇజ్రాయెల్‌ చర్యలను మద్దతు ఇచ్చింది. అయితే గాజా/లెబనాన్‌ ఆపరేషన్లపై కొన్ని విమర్శలు, హ్యూమనిటేరియన్‌ ఆందోళనలు వ్యక్తం చేసింది. కానీ తాజాగా నెతన్యాహు ముందు నిరసన తెలుపడం ఒక షాకే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper