Cooku With Jathiratnalu 2: స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగిన ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో నిన్నటి ఎపిసోడ్ తో పూర్తి అయ్యింది. టైటిల్ విన్నర్ గా తనూజ నిలబడగా , రన్నర్ గా డిమోన్ పవన్ నిలిచాడు. అయితే ఈ షో లో మొదటి నుండి అద్భుతమైన వంటకాలు అందిస్తూ , మరోపక్క జాతి రత్నాలు తో సమానంగా ఎంటర్టైన్మెంట్ ని అందించిన ‘రాకింగ్ రాకేష్’ 4 వ స్థానం లో ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. రాకేష్ కూడా ‘ఇది నేను ఊహించలేదు.. చాలా కష్టపడ్డాను’ అంటూ ఎమోషనల్ అయిపోయాడు. ఆయన్ని తోటి కంటెస్టెంట్స్ తో పాటు , జాతి రత్నాలు కూడా ఓదార్చారు. ఇక సమానమైన మార్కులతో అదే నాల్గవ స్థానం లో ఆషికా నిలబడగా, మూడవ స్థానం లో నిఖిల్ విజయేంద్ర సింహా నిలిచాడు.
అయితే చూసేందుకు తనూజ వంటకం కంటే , అందరి వంటకాలు ప్రజంటేషన్ అద్భుతంగా ఉన్నాయి, వాటికి కూడా మార్కులు ఉంటాయని జడ్జీలు అన్నారు, కచ్చితంగా టేస్ట్ కూడా బాగానే ఉంది ఉంటుంది, అయినప్పటికీ తనూజ ని టైటిల్ విన్నర్ చేయడం పై రాజకీయం ఏమైనా ఉందా అనే సందేహాలు ఇతర కంటెస్టెంట్స్ కి సంబంధించిన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. దానికి తోడు ఈ షో కి జడ్జీ గా వ్యవహరించిన వారిలో ఒకరైన ‘ముచ్చర్ల అరుణ’ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ‘నిజమైన విన్నర్ డిమోన్ పవన్’ అంటూ స్టేటస్ పెట్టడం , ఆ తర్వాత ‘చూసుకోకుండా పెట్టాను’ అంటూ ఆమె డిలీట్ చేయడం సోషల్ మీడియా లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో టైటిల్ విన్నర్ డిమోన్ పవన్ అని , తనూజ ని కావాలని ఉద్దేశపూర్వకంగానే విన్నర్ ని చేశారు అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తనూజ సీజన్ 1 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని 6 వ స్థానం లో ఎలిమినేట్ అయ్యింది. అంతే కాకుండా ‘బిగ్ బాస్ 9’ లో కచ్చితంగా ఈ టైటిల్ ని గెలుస్తుందని అంతా అనుకున్నారు , కానీ చివరికి రన్నర్ గానే మిగిలింది. అందుకే ఆమె అభిమానులను నిరాశ పర్చడం ఇష్టం లేక , స్టార్ మా ఛానల్ కావాలని ఉద్దేశపూర్వకంగానే తనూజ ని టైటిల్ విన్నర్ గా ప్రకటించారు అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం బాగా వైరల్ అయితే , తనూజ కూడా రియాక్షన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.