Homeజాతీయ వార్తలుAbhijit Dipke: అభిజిత్‌ దీప్కే చిన్న మార్పులు.. పెద్ద స్కెచ్‌ వేసిన ఆప్‌ చీఫ్‌!

Abhijit Dipke: అభిజిత్‌ దీప్కే చిన్న మార్పులు.. పెద్ద స్కెచ్‌ వేసిన ఆప్‌ చీఫ్‌!

Abhijit Dipke: కొన్ని సమయాల్లో చేసే సాధారణ మార్పులు కూడా పెద్ద రాజకీయ ప్లాన్‌కు భాగం అవుతాయి. ఆప్‌ పార్టీలోని అభిజిత్‌ దీప్కే ఇటీవల కాలంలో చూపిస్తున్న ప్రవర్తన, మీడియా కవరేజీల నమూనా ఇలాంటి ఆలోచనకు దారి తీస్తోంది.మొన్నటి వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నీట్‌ లీకేజీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా లక్ష్యంగా ఆందోళన చేశారు. మంత్రి రాజీనామా తర్వాత విజయం సాధించామని సంబురాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు దీప్కే ఢిల్లీ, ముంబైలకు […]

Abhijit Dipke: కొన్ని సమయాల్లో చేసే సాధారణ మార్పులు కూడా పెద్ద రాజకీయ ప్లాన్‌కు భాగం అవుతాయి. ఆప్‌ పార్టీలోని అభిజిత్‌ దీప్కే ఇటీవల కాలంలో చూపిస్తున్న ప్రవర్తన, మీడియా కవరేజీల నమూనా ఇలాంటి ఆలోచనకు దారి తీస్తోంది.మొన్నటి వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నీట్‌ లీకేజీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా లక్ష్యంగా ఆందోళన చేశారు. మంత్రి రాజీనామా తర్వాత విజయం సాధించామని సంబురాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు దీప్కే ఢిల్లీ, ముంబైలకు రాకుండా షంబాజీ జిల్లాలోని సొంత గ్రామంలో ఉంటున్నారు. హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడకుండా కేవలం మరాఠీలోనే మాట్లాడుతున్నారు. ఇవి చిన్న మార్పులుగా కనిపించినా, వెనుక పెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు చూస్తున్నారు.

మరాఠీ ఇమేజ్‌పై దృష్టి..
అభిజిత్‌ దీప్కే జాతీయ స్థాయి విషయాలు మాట్లాడటం తగ్గించి, మహారాష్ట్రలోనే ఉండి పాఠశాలల తనిఖీల వంటి స్థానిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని మహారాష్ట్ర మీడియా సంస్థలు ఆయన చేసే ప్రతి చర్యనూ పెద్ద వార్తగా ప్రచురిస్తున్నాయి. యువతకు ఆదర్శంగా చూపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గోమాంతక్‌ వంటి మీడియా, ముంబై తక్‌ చానెల్‌ వంటివి ఆయన మరాఠీ ఇమేజ్‌ను ప్రత్యేకంగా హైలైట్‌ చేస్తున్నాయి. మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేక దృక్పథం ఉన్న కొందరు జర్నలిస్టులు కూడా డజన్ల కొద్దీ వీడియోలు, వ్యాసాలు రాయడం గమనార్హం. ఇలా ఒకే నాయకుడిని ఇంత పెద్ద ఎత్తున ప్రొజెక్ట్‌ చేయడం సాధారణం కాదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు కనిపించకపోవడం మరింత ఆసక్తికరం.

గోవా ఎన్నికల కోసమే..
దీప్కే ప్రొజెక్ట్‌కు ప్రధాన కారణం త్వరలో జరగనున్న గోవా ఎన్నికలే అని విశ్లేషణలు సూచిస్తున్నాయి. గోవాలోని చిన్న గ్రామాలు, పట్టణాల్లో సుమారు 25 శాతం మంది మరాఠీ మాట్లాడతారు. ఈ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మరాఠీ మాట్లాడే యువ నాయకుడిగా దీప్కేను నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఆప్‌ పార్టీని అక్కడ బలోపేతం చేసేందుకు ఆయనను ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవలే గోవాలో పర్యటించారు. రాబోయే ఎన్నికలకు ముందుగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరాఠీలను ఆకట్టుకునే విప్లవకారుడి ఇమేజ్‌తో దీప్కేను ప్రొజెక్ట్‌ చేయడం ఈ వ్యూహంలో భాగమేనని అంచనా.

రాజకీయ వ్యూహం..
జాతీయ ఉద్యమాలపై మాట్లాడటం మానేసి స్థానిక, భాషాపరమైన గుర్తింపుపై దృష్టి పెట్టడం ఒక వ్యూహాత్మక మార్పు. మోదీ వ్యతిరేక శక్తులు ఆయనను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కూడా గమనార్హం. యువ ఓటర్లను ప్రభావితం చేసేందుకు, మరాఠీ గుర్తింపును ఉపయోగించుకుని గోవాలో ఆప్‌ పార్టీకి స్థానం సంపాదించేందుకు ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోంది.

దీప్కే ప్రవర్తనలోని మార్పులు, మీడియా కవరేజీ, గోవా ఎన్నికల సమయం ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం వ్యక్తిగత ఎంపిక కాదు. ఒక నిర్దిష్ట రాజకీయ లక్ష్యంతో రూపొందిన వ్యూహంగా కనిపిస్తోంది. గోవాలోని మరాఠీ మాట్లాడే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆప్‌ పార్టీ తన పాదాలు పాతుకుపోయేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper