spot_img
Homeజాతీయ వార్తలు2029 Elections: యువతే లక్ష్యంగా 2029 ఎన్నిక వ్యూహాలు.. ప్లాన్‌ వర‍్కవుట్‌ అయ్యేనా?

2029 Elections: యువతే లక్ష్యంగా 2029 ఎన్నిక వ్యూహాలు.. ప్లాన్‌ వర‍్కవుట్‌ అయ్యేనా?

2029 Elections: రాజకీయ పార్టీల మద్దతు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. తాజాగా కాక్రోచ్‌ జనతా పారీ‍్ట పేరిట ఒక ఆందోళన జరిగింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై ఈ సంస్థ నిర్వహించిన కాక్రోచ్‌ జనతా పార్టీ సంస్థలకు సోషల్‌ మీడియాలో వచ్చిన హైప్‌, మద్దతు క్షేత్రస్థాయిలో లేదు. క్రమంగా దాని ప్రభావం తగ్గుతోంది. యువకులు, తల్లిదండ్రులు కూడా దానికి దూరమవుతున్నారు.మొదట్లో మీడియా ఎక్కువగా కవరేజ్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ ఆసక్తి తగ్గింది. నిరసనలు, ఉద్యమాలకు మునుపటి స్థాయిలో మద్దతు రావడం లేదు.

సోషల్ మీడియా ద్వారా..
రాబోయే మూడేళ్లలో 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు యువ ఉద్యమాలపై దృష్టి పెడుతున్నాయి. కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు యువతను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఓటర్ల మనసులను నెమ్మదిగా ప్రభావితం చేయడం ఈ వ్యూహంలో భాగం. 2029లో మొదటిసారి ఓటు వేసే యువకులు మోదీ ప్రధాని అయినప్పటి నుంచి పెరిగిన తరం. వారిని ప్రభావితం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కీలకంగా మారాయి. తమిళనాడులో నటుడు విజయ్ అభిమాన సంఘాలు యువతను సమీకరించి రాజకీయ మార్పుకు దోహదపడినట్లు ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి మోడల్‌ను ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రైతు సమస్యల నుంచి యువత వైపు..
గతంలో రైతు ఉద్యమాలు విపక్షాలకు బలమైన సాధనంగా ఉండేవి. 2024 ఎన్నికల్లో ఇది పెద్ద ప్రభావం చూపుతుందని భావించినా, ఆ ఉద్యమాల నాయకులు పార్టీలు పెట్టి పోటీ చేసినప్పుడు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో విపక్షాలు రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత పెరగలేదని గ్రహించి, ఇప్పుడు యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. పేదలు, మహిళలు వంటి వర్గాల్లో బీజేపీకి ఉన్న మద్దతును దృష్టిలో ఉంచుకుని, యువత ద్వారా బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతలో అసంతృప్తిని పెంచి, బీజేపీని లక్ష్యంగా చేసుకునే వ్యూహం ఇది.

బీజేపీ ముందున్న సవాళ్లు..
ఈ మార్పులు బీజేపీకి కొత్త సవాళ్లను తెస్తున్నాయి. యువతను తమ వైపుకు నిలబెట్టుకోవడం రాబోయే రోజుల్లో కీలకం కావచ్చు. సోషల్ మీడియా శక్తిని ఉపయోగించి విపక్షాలు యువతలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, బీజేపీ కూడా యువత సమస్యలు ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాలపై దృష్టి పెంచి, వారిని ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలి. రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర పెరిగిన నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతులతో సరిపోదు.

2029 ఎన్నికలు యువత ఓట్లపై ఎక్కువగా ఆధారపడి ఉండబోతున్నాయి. విపక్షాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, బీజేపీ తన బలాలను కాపాడుకుంటూ యువతను తమవైపు తిప్పుకునే వ్యూహాలను రూపొందించాలి. ఇది రాజకీయాల్లో తరం మార్పు, డిజిటల్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper